హరీష్ శంకర్ నెక్ట్స్ మెగా హీరోతో
హైదరాబాద్ : గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం అందించిన హరీష్ శంకర్ వెను వెంటనే రామయ్యా వస్తావయ్యా అంటూ డిజాస్టర్ ఇచ్చారు. దాంతో ఆయన కంటిన్యూగా ప్రాజెక్టులు చేయాల్సిన హరీష్ ఖాళీ పడ్డారు. అయితే ఇప్పుడు మెగా క్యాంప్ నుంచి వస్తున్న మరో హీరో సాయి ధరమ్ తేజ తో ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం. ఆ ప్రాజెక్టు మరేదో కాదు 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ' .
గతంలో రవి తేజ సుబ్రహ్మణ్యం పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినపడ్డాయి. తర్వాత అల్లు అర్జున్ అనుకున్నారు. చివరకు సునీల్ పేరు కూడా బయిటకు వచ్చింది.అయితే అవేమీ మెటీరియలైజ్ కాలేదు. దాంతో ఇప్పుడు మార్కెట్లో క్రేజ్ గా ఉన్న సాయి ధరమ్ తేజ తో ఆయన చిత్రం మొదలెట్టారు. ఈ చిత్రంతో తప్పకుండా హిట్ కొడతాననే ధీమాగా ఉన్నారు హరీష్ శంకర్.
ఇక సాయిధరమ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్' . షూటింగ్ లేటైనా ట్రేడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ చిత్రం గురించి వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది. ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తొలి సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.


Click it and Unblock the Notifications












