దిల్ రాజు కి రిలీఫ్... 'లవర్' దొరికాడు

By Srikanya

హైదరాబాద్ : దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతకు కూడా హీరోలు దొరకరా అంటే,ఒక్కోసారి దొరకరు అనే చెప్పాలి. ఆయన చాలా కాలంగా 'లవర్' అనే స్క్రిప్టుని రెడీ చేయించి,హీరో కోసం ఎదురుచూస్తున్నారు. వాసు వర్మ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి మొత్తానికి హీరో సెట్ అయ్యాడని ఫిల్మ్ నగర్ సమాచారం. అతను మరెవరో కాదు సాయి ధరమ్ తేజ. ఈ మేరకు వాసు వర్మ...సాయి ధరమ్ తేజ ని కలిసి మాట్లాడారని, త్వరలోనే గ్రాండ్ గా చిత్రం ప్రారంభమయ్యే అవకాసం ఉంది.

వాసు వర్మ గతంలో నాగచైతన్య ని హీరోగా లాంచ్ చేస్తూ దిల్ రాజు నిర్మాతగా జోష్ అనే చిత్రం రూపొందించారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో చాలా గ్యాప్ వచ్చింది. ఇదే 'లవర్' సబ్జెక్టుని అల్లు అర్జున్ తో అనుకున్నారు. అయితే అదీ పట్టాలు ఎక్కలేదు. సరైన హీరో దొరకక ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తున్న ఈ సబ్జెక్టుకు సాయి ధరమ్ తేజ అయితే న్యాయం చేసే అవకాసం ఉందని అంటున్నారు.

Sai Dharam Teja with Dil Raju 'Lover'

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ తన రేయ్ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్' . షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం మే 9 న విడుదల చేయాలని దర్శక,నిర్మాత వైవియస్ చౌదరి నిర్ణయించారు.

వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్‌లో సెటిల్‌ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్‌ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్‌, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్‌లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది.'' అని తెలిపారు.

అలాగే... ''సాయిధరమ్‌తేజ్‌లో రెండు కోణాలున్నాయి. 'రౌడీ అల్లుడు'లో చిరంజీవిగారు పోషించిన కల్యాణ్‌ కుమార్‌ పాత్రలా నెమ్మదిగాను, ఆటో జానీలా మాస్‌గానూ సాయిధరమ్‌తేజ్‌ నాకు కనిపిస్తుంటాడుయ. సినిమా విజయం తర్వాత కొట్టే చప్పట్ల కన్నా.. ముందు కొట్టే చప్పట్లకు విలువ ఎక్కువ. నాకు ఈ సినిమా ద్వారా అవి లభించాయి. చక్రి, చంద్రబోస్‌, శ్రీధర్‌ సీపాన తదితర చిత్రబృందం చక్కటి సహకారం అందించారు. వచ్చే నెల 9న ప్రేక్షకులు కొట్టే చప్పట్ల కోసం ఎదురు చూస్తున్నాం'' అన్నారు.

చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కన్నా ఈ మేనల్లుడిలోనే చిరు పోలికలు బాగా ఉన్నాయి చిరంజీవి నట వారసత్వాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోగల సత్తా సాయి ధరమ్ తేజకే ఉన్నాయనిపిస్తోందన్న వాదనలను కూడా తీసుకవస్తున్నారు. ఏదైనా మేనమామ పోలికలు వస్తే అదష్టవంతులవుతారంటారు. మరి తన మేనమామలా సాయి ధరమ్ తేజ కూడా స్టార్ అవుతాడో లేదో వేచి చూడాల్సిందే... చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X