అల్లు అర్జున్ ప్లేస్ లోకి సాయి ధరమ్ తేజ
ఇదిలావుంటే... తొలి, మలి సినిమాలు విడుదల కాకముందే మరో అవకాశాన్ని సాయిధరమ్‌తేజ్ కొట్టేసినట్టు సినీవర్గాల సమాచారం. 'జోష్' ఫేం వాసువర్మ దర్శకత్వంలో ఆయన నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడని చెప్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ లవర్ అని... అల్లు అర్జున్ తో అనుకున్న ప్రాజెక్టు లేట్ అవటంతో ఇలా ప్రొసీడ్ అవుతున్నాడని చెప్తున్నారు.
'రేయ్'నిమిత్తం విడుదల చేసిన ఫొటోలతోనే సాయిధరమ్‌తేజ్ ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. మరో మెగా వారసుడు వస్తున్నాడని అంతా ప్రశంసించారు. ఆ స్టిల్స్ చూసినవారందరూ ముక్తకంఠంతో అంటున్న మాట ఒక్కటే. 'మేనమామ చిరంజీవి జిరాక్స్ ప్రింట్‌లా ఉన్నాడే' అని. తొలి చిత్రం విడుదలకు ముందే మెగా అభిమానులకు చేరువయ్యారు సాయిధరమ్‌తేజ్.
ఇక యూత్ మెచ్చే అద్భుతమైన కథను సాయిధరమ్ కోసం వాసువర్మ తయారు చేసినట్లు తెలిసింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించబోతున్నారని వినికిడి. ఇప్పటికే టాక్స్ జరిగాయని చెప్తున్నారు. త్వరలోనే చిత్రం ప్రారంభమయ్యే అవకాసం ఉంది. సాంకేతిక నిపుణులు, మిగతా తారాగమం వంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












