»   » వరుణ్ తేజ ప్రాజెక్టుని, రామ్ చరణ్ టైటిల్ ని తీసేసుకుని...

వరుణ్ తేజ ప్రాజెక్టుని, రామ్ చరణ్ టైటిల్ ని తీసేసుకుని...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా హీరోల మధ్య పోటీ వాతావరణం నెలకొనింది. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ ..ఇప్పటికే సెటిలైన మెగా హీరోలతో పోటీపడుతున్నాడు. మాస్ హీరోగా రోజురోజుకీ ఎదుగుతున్నాడు. అందులో భాగంగా కొన్ని స్ట్రాటజీలు అమలు చేస్తున్నాడు.

అయితే ఆ స్ట్రాటజీలు తమ కుటుంబ హీరోలపైనే ప్రయోగిస్తున్నాడా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు సాయి ధరమ్ తేజ చిత్రం గురించి తెలుసుకుంటే మీకూ ఆ సందేహం వస్తుంది. సాయి ధరమ్ తేజ చేస్తున్న పని సబబేనా అనే డౌట్ కూడా వస్తుంది.

ఇంతకీ సాయి ధరమ్ తేజ ఏం చేస్తున్నాడు అంటే ..రామ్ చరణ్ కు అనుకున్న టైటిల్ ని తన సినిమాకు పెట్టేసుకుని క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేనా వరుణ్ తేజతో అనుకున్న ప్రాజెక్టుని తన వద్దకు రప్పించుకుని చేసేస్తున్నట్లు సమచారం.

ఇంతకీ ఏమీటా టైటిల్, ఏ ప్రాజెక్టు ..డైరక్టర్ ఎవరూ అనే విషయాలు

క్రింద స్లైడ్ షోలో

ఇంకోటి

ఇంకోటి

చిరంజీవి కెరీర్ ప్రారంభం రోజుల్లో సుప్రీమ్ స్టార్ అనే బిరుగు ఉండేది. దాన్నే టైటిల్ గా పెట్టి ...సుప్రీమ్ అంటూ సినిమా చేస్తున్న సాయి ధరమ్ తేజ మరో అడుగు వేసాడు.

ఈ టైటిల్ ని కూడా

ఈ టైటిల్ ని కూడా

అప్పట్లో చిరంజీవి సూపర్ హిట్ చిత్రం "గ్యాంగ్ లీడర్" టైటిల్ ని కూడా ఇప్పుడు వాడేస్తున్నట్లు సమచారం.

వాస్తవానికి

వాస్తవానికి

రామ్ చరణ్ బ్రూస్ లీ చిత్రం సమయంలో మెరుపు, గ్యాంగ్ లీడర్ టైటిల్స్ ని చిరంజీవి ప్రపోజల్ పెట్టారు. అయితే ఎవరూ ఊహించని విధంగా శ్రీను వైట్ల బ్రూస్ లీ టైటిల్ పెట్టారు.

ఈ లోగా

ఈ లోగా

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి సాయిధరమ్ తేజ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

సినమానే

సినమానే

అసలు ఈ సినిమానే మొదట వరుణ్ తేజ తో మొదలవుతుందనుకున్నారు. అయితే ఊహించని విధంగా సాయి ధరమ్ తేజ దగ్గరకు వచ్చింది.

వద్దంటున్నారు

వద్దంటున్నారు

అయితే సాయి ధరమ్ తేజ ఈ టైటిల్ పెట్టడం ఇష్టం లేదంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ కే

రామ్ చరణ్ కే

చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ కు ఈ టైటిల్ పెడితే...ఫెరఫెక్ట్ అంటున్నారు.

సైలెంట్

సైలెంట్

అయితే ఈ విషయమై మెగా క్యాంప్ సైలెంట్ గా ఉంది..రామ్ చరణ్ కు ఈ విషయం తెలిసి...మనవాడే కదా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

English summary
If reports are true..for director Gopichand Malineni's upcoming film, we hear that Sai dharam will use "Gang Leader" title.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu