సాయిధరమ్‌తేజ్‌ `పిల్లా నువ్వు లేని జీవితం' కథ ఇదే...

By Srikanya

హైదరాబాద్ : సాయిధరమ్‌తేజ్‌ హీరోగా లాంచ్ అవుతూ చేసినచిత్రం `పిల్లా నువ్వు లేని జీవితం' ఈ రోజు విడుదల అవుతోంది. రెజీన హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్-శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌‌స సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్ని వాసు-శ్రీ హర్షిత్‌ నిర్మాతలు. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకుడు. అనూప్‌ రూబెన్‌‌స సంగీతం అందించారు.

ఈ చిత్రం కథలో గంగ ప్రసాద్(షాయీజీ షిండే), ప్రభాకర్(ప్రకాష్ రాజ్) ఇద్దరూ పొలిటీషన్స్...బద్ద శత్రవులు. సిఎం పోస్ట్ కోసం పోటీ పడుతూంటారు. ఈ లోగా వై ఛానెల్ ఇన్విస్టిగేటివ్ జర్నలిస్టు షఫీ... వీరిద్దరు గురించి కొన్ని నిజాలు వెలికి తీస్తాడు. దాంతో ఆ జర్నలిస్టు ని, మరో అమ్మాయిని చంపేయటానికి ఓ రౌడీ మైసమ్మ(జగపతిబాబు)కి సుపారి ఇస్తారు. దాంతో మైసమ్మవారిని చంపేయటానికి వెతుకుతూంటాడు. ఈ లోగా పాలకొల్లు నుంచి వచ్చిన శ్రీను(సాయి ధరమ్ తేజ) మైసమ్మ డైన్ లోకి వచ్చి తనని చంపేయమని అంటాడు. షాకైన మైసమ్మ ఎందుకలా అన్నావు అనిడిగే... తనకు సిరి(రెజీనా)తో ఉన్న లవ్ స్టోరీ ని చెప్తాడు. అంతేకాకుండా... ఓ షాకింగ్ ట్విస్ట్ ని రివిల్ చేస్తాడు. ఆ షాకింగ్ ట్విస్ట్ ఏమిటి... మైసమ్మ చంపుదామనుకున్న అమ్మాయి ఎవరు.. అసలు దీని వెనక ఉన్న అసలు నిజం ఏమిటనేది మిగతా కథ.

Sai Dharma Teja's Pilla Nuvvu Leni Jeevitham Story Line

ఇక ఈ చిత్రం 400 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా నేడు రిలీజవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాతగా 50 సినిమాలు తెరకెక్కించా. నేను నిర్మించిన 50సినిమాలు ఒక ఎత్తు. పిల్లా నువ్వు లేని జీవితం ఇంకో ఎత్తు. పెద్ద విజయం సాధిస్తుంది అన్నా మెగా నిర్మాత అల్లు అరవింద్‌. ఈ సినిమా గొప్ప ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరి. సాయిధరమ్‌ తేజ్‌ హీరోనే కాదు స్టార్‌ మెటీరియల్‌ అని నిరూపించే సినిమా ఇది. తప్పక విజయం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారాయన.

మరో నిర్మాత దిల్‌రాజు సైతం సాయిధరమ్‌పై పెద్ద రేంజులో ప్రశంసలు కురిపించారు. బన్నికి `ఆర్య'లా, నితిన్‌కి `దిల్‌'లా, చరణ్‌కి `మగధీర' లా సాయిధరమ్‌కి `పిల్లా నువ్వు లేని జీవితం' అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సాయిధరమ్‌ డ్యాన్సింగ్‌ స్టయిల్‌, ఎనర్జీ ఈ సినిమాకి పెద్ద అస్సెట్‌ అవుతాయని రెజీన చెబుతోంది. ఇద్దరు అభిరుచి ఉన్న నిర్మాతల కలయికలో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X