‘సైరా’లో ఆయన పనితీరు హైలైట్.. క్లైమాక్స్‌లో ప్రధానాకర్షణ అవేనట

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మన సినిమాల హవా కనిపిస్తోంది. కొద్దిరోజులుగా సాహో సందడి చేస్తుండగా.. ఇటీవలే సైరా: నరసింహారెడ్డి హడావిడి కూడా మొదలైంది. దీంతో అందరి దృష్టి టాలీవుడ్‌పై పడింది. సాహో విడుదలకు సిద్ధం అయిపోగా.. సైరా మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఆయన డైలాగులు ఈ సినిమాకు హైలైట్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో సాయి మాధవ్ డైలాగులకు మంచి రెస్పాన్స్ రావడం ఖాయమంటున్నారు. అలాగే, క్లైమాక్స్‌లో వచ్చే సంభాషణలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఆయన రాసిన డైలాగులు చిరంజీవి నోట వినడానికి ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Sai Madhav Burra Super Work For Sye Raa Narasimha Reddy

మరోవైపు, సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే 'సైరా' మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ గత నెల 14న విడుదల చేసింది. దీనికి భారీ స్పందన వచ్చింది. అలాగే, 'సైరా' సినిమా టీజర్‌ను ఆగస్టు 20న వదిలారు. దీనికి కూడా విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత ముంబైలో ప్రెస్‌మీట్ కూడా నిర్వహించారు. దీనికి బడా స్టార్లు హాజరైన విషయం తెలిసిందే.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమే 'సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X