సాయిపల్లవి ఎంటర్! ఆర్ఆర్ఆర్ టీమ్‌లో కొత్త కల.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
బాహుబలి తర్వాత రాజమౌళి రూపుదిద్దుతున్న భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాపై ఆసక్తిగా ఉంది ప్రేక్షకలోకం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ ప్రారంభంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా తారాగణం ఎవరనేది ప్రకటించారు రాజమౌళి. 1920 లో బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న విలక్షణ కథాంశం కావడంతో నటీనటుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు జక్కన్న. ముఖ్యంగా చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరూ బడా స్టార్స్ కావడంతో హీరోయిన్స్ ఎంపికపై భారీ కసరత్తులు చేసిన జక్కన చివరకు చెర్రీ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్‌లను ఎంపిక చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి డైసీ తప్పుకోవడంతో ఆమె స్థానంలో నటించబోయే హీరోయిన్ ఎవరనేదానిపై ప్రేక్షుకుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో నిత్యామీనన్ పేరు బలంగా వినిపించింది. ఆ తర్వాత కథకు తగ్గట్టుగా మళ్లీ బ్రిటిష్ భామ కోసమే జక్కన్న వేట మొదలైందనే టాక్ వచ్చింది. అవ్వన్నీ పక్కనబెట్టి ఇప్పుడు లేడీ నాచురల్ స్టార్ సాయి పల్లవి పేరు వినిపిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఫారెన్ బ్యూటీనే తీసుకుందామనుకున్న జక్కన్న.. చివరకు కథలో కొన్ని మార్పులు చేసి ఆ పాత్రను భారతీయ యువతిగా మార్చేశారట. ఈ నేపథ్యంలో ఆ క్యారెక్టర్‌కి సాయి పల్లవిని బెటర్ ఆప్షన్ అని భావించిన చిత్రయూనిట్ ఇటీవలే ఆమెను సంప్రదించినట్టు ఫిలింనగర్ టాక్. ఇందులో నిజం ఎంతుందో కాని ఒకవేళ వాస్తవమే అయితే ఇప్పటికే పీక్స్‌లో ఉన్న ఆర్ఆర్ఆర్ హైప్‌కి ఇంకాస్త డోస్ యాడ్ అవుతుంది. పైగా ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి అంటే ఇక వారిద్దరి చిందులు స్టేజీలు ఎలా దద్దరిల్లిపోతాయో ఓ సారి ఊహించుకోండి!


Click it and Unblock the Notifications











