హీరోయిన్ మాజీ భర్త ప్రేమలో సాయి పల్లవి.. త్వరలోనే పెళ్లి ?
Recommended Video

ప్రేమమ్ చిత్రంతో సౌత్ లో గుర్తింపు పొందిన సాయి పల్లవి, ఫిదా చిత్రంతో తెలుగులో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అందాల ఆరబోతకు దూరంగా ఉండే సాయి పల్లవి నటనతోనే ఇంతటి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కుర్రకారు సాయిపల్లవి నటనకు ఫిదా అవుతుంటారు. ఫిదా, ఎంసీఏ, పడిపడి లేచే మనసు లాంటి చిత్రాలు సాయి పల్లవి నటించింది. తాజాగా సాయి పల్లవి గురించి ఓ ఆసక్తికరమైన రూమర్ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!

దర్శకుడితో ప్రేమలో
సాయి పల్లవి ఓ తమిళ దర్శకుడితో ఘాటైన ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు.. అమలాపాల్ మాజీ భర్త విజయ్. విజయ్ దర్శకత్వంలో సాయి పల్లవి కారు దర్శకత్వంలో నటించింది. అప్పటి నుంచి వీరి మధ్య బంధం బలపడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి, విజయ్ సహజీవనం చేస్తున్నట్లు తమిళ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇటు అభిమానులని కూడా సాయి పల్లవి లవ్ ఎఫైర్ న్యూస్ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

త్వరలో పెళ్లి
ఈ జంట త్వరలో వివాహానికి కూడా సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ రిలేషన్ షిప్ ని సాయి పల్లవి, విజయ్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అమలాపాల్, విజయ్ 2014లో వివాహం చేసుకున్నారు. విభేదాలతో 2017లో విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్, విజయ్ వారి వారి చిత్రాలతో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో విజయ్, సాయి పల్లవి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.

హీరోయిన్‌గా బిజీ
సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. సూర్య ఎన్ జి కె చిత్రంలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు మరో మలయాళం చిత్రంలో కూడా సాయి పల్లవి నటిస్తోంది. దర్శకుడు విజయ్ దేవి 2, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో జయలలిత బయోపిక్ చిత్రాలని తెరకెక్కిస్తున్నాడు.

పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటూ
సాయి పల్లవి ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించింది. మరి విజయ్ తో వస్తున్న లవ్ ఎఫైర్ రూమర్స్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి. విజయ్, అమలాపాల్ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. కానీ వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాల గురించి స్పందించేందుకు ఇష్టపడలేదు.


Click it and Unblock the Notifications











