సాయి పల్లవి డేరింగ్ నిర్ణయం.. కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వదిలేసి.. ఆ డైరెక్టర్‌తో!
మలయాళంలో మెరిసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.. ప్రేమమ్ సినిమాలో మలర్‌గా అందర్నీ కట్టిపడేసింది. మేకప్ లేకుండా సహజ సౌందర్యంతోనే తెరపై కనిపించే ఈ హీరోయిన్ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఏ భాషలో సినిమాను చేసిన తన గొంతును వినిపించేందుకు కష్టపడే ఈ భామకు.. హిట్లతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.

ఫిదా చేసిన సాయి పల్లవి..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే ఫిదా చేసింది. తనదైన యాటిట్యూడ్, నటనతో ఆకట్టుకున్న సాయి పల్లవి టాలీవుడ్‌లో క్రేజీగా మారిపోయింది. దీంతో వరుస ఆఫర్లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి

వరుస చిత్రాలతో బిజీ
ఫిదా అనంతరం నాని హీరోగా వచ్చిన ఎమ్‌సీఏ, శర్వానంద్‌తో పడి పడి లేచే మనసు, మరో ద్విభాషా చిత్రం కణంతో ఫుల్ బిజీగా మారింది. కానీ ఇంతవరకు సాయి పల్లవికి సరైన కమర్షియల్ హిట్ పడలేదు.అయినా ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

చేతిలో పల్లు ప్రాజెక్ట్స్..
సాయి పల్లవి ప్రస్తుతం మరోసారి ఫిదా చేసేందుకురెడీ అవుతోంది. నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోండగా.. రానాతో విరాట పర్వం అనే పీరియాడిక్ డ్రామాలోనక్సలైట్ పాత్రను పోషిస్తుంది. ఇలా తనకు నచ్చిన కథలను ఎంచుకుంటూ నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ వస్తోంది.
Recommended Video

వెబ్ సిరీస్‌లోకి ఫిదా భామ
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. వెబ్ సిరీస్‌ల హవా సాగుతోంది. హాలీవుడ్, బాలీవుడ్‌లో ఇప్పటికే ట్రెండీగా మారగా.. దక్షిణాదినా వాటి జోరు పెరుగుతోంది. పెద్ద స్టార్స్ సైతం.. వాటిలో నటించేందుకు సుముఖుత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి సాయి పల్లవి చేరిందని టాక్. వినూత్న దర్శకుడు వెట్రి మారన్ తెరకెక్కించే ఓ వెబ్ సిరీస్‌లో సాయి పల్లవి నటించబోతోందని సమాచారం.


Click it and Unblock the Notifications











