సాయి పల్లవికి బిగ్ షాక్.. ఆ విషయంలో రామాయణ మేకర్స్ కీలక నిర్ణయం!

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన సహజ సిద్ధమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. 'ప్రేమమ్'తో ఇండస్ట్రీలోకి వచ్చి, 'ఫిదా'తో టాలీవుడ్‌లో స్టార్‌గా మారింది. గ్లామర్‌కు దూరంగా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింఘా రాయ్', 'విరాట పర్వం' వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటనతో పాటు డ్యాన్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎక్స్‌పోజింగ్ వంటి వాటికి దూరంగా తెలుగింటి సంప్రదాయ పాత్రల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ' సినిమాలో సాయి పల్లవి సీత పాత్ర పోషిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో రామాయణ్ మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారంట.

బాలీవుడ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రామాయణ' ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుండటం తెలిసిందే. తన నేచురల్ యాక్టింగ్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి ఈ పాత్రపై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Sai Pallavi Faces Dubbing Buzz in Ramayana After Ek Din Flop Sparks Debate in Bollywood

బాలీవుడ్ ఎంట్రీ.. ఆశించిన ఫలితం రాలేదా?

ఇటీవల సాయి పల్లవి బాలీవుడ్‌లో ఏక్ దిన్ (Ek Din)సినిమాతో అడుగుపెట్టింది. ఈ సినిమాలో జూనైద్ ఖాన్ (Junaid Khan) సరసన నటించిన ఆమెకు యాక్టింగ్ పరంగా మంచి ప్రశంసలు లభించినా.. సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ రూ.5 కోట్ల వసూళ్లను కూడా దాటలేకపోయి ఈ ఏడాది పెద్ద ఫ్లాప్‌ల జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. సినిమా ఫెయిల్యూర్‌కు ఒక కారణంగా ఆమె హిందీ డబ్బింగ్‌పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ కూడా చెప్పుకుంటున్నారు. సాయి పల్లవి హిందీ ఉచ్చారణలో దక్షిణాది యాస స్పష్టంగా వినిపించడంతో కొంతమంది ప్రేక్షకులు విమర్శించారు.

'రామాయణ'లో డబ్బింగ్ మారుతుందా?
ఇదే అంశం ఇప్పుడు 'రామాయణ' టీమ్‌ను ఆలోచనలో పడేసినట్లు సమాచారం. పౌరాణిక సినిమా 'రామాయణ'లో సంభాషణలు చాలా ముఖ్యమని, ముఖ్యంగా సీత పాత్రకు గ్రాంధికమైన, స్పష్టమైన హిందీ అవసరమని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. యాస కారణంగా పాత్ర గాంభీర్యం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో సాయి పల్లవి పాత్రకు వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ ఉపయోగించే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాధారణంగా తన సినిమాల్లో తనే డబ్బింగ్ చెప్పుకునే సాయి పల్లవికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె నటనలో వాయిస్ కూడా ఒక ముఖ్యమైన భాగం. అయితే ఈసారి పాన్ ఇండియా లెవెల్‌లో పర్‌ఫెక్షన్ కోసం మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారీ బడ్జెట్.. భారీ అంచనాలు
'రామాయణ' చిత్రం దాదాపు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని టాక్. అలాంటి ప్రాజెక్ట్‌లో ప్రతి చిన్న అంశాన్ని కూడా పర్ఫెక్ట్‌గా చూపించాలని మేకర్స్ భావించడం సహజం. ముఖ్యంగా భాష, డైలాగ్ డెలివరీ విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డబ్బింగ్ మార్పు విషయంపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ టాక్ మాత్రమే. నిజంగా సాయి పల్లవి వాయిస్‌ను రీప్లేస్ చేస్తారా? లేక ఆమెనే మెరుగైన హిందీతో డబ్బింగ్ చెప్తారా? అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సిందే.

Read more about: ramayan ranbir kapoor sai pallavi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X