కెరీర్లోనే బిగ్గెస్ట్ ఆఫర్ పట్టేసిన సాయి పల్లవి .. ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంత కాలంలోనే మంచి స్టార్ స్టేటస్ తెచ్చుకుంటారు. అయితే అందుకు గ్లామ్ షో లేదా స్టార్ కుటుంబం నుంచి రావాల్సి ఉంటుంది. కానీ మరికొంతమంది మాత్రం కేవలం తమ పెర్ఫామెన్స్ , లుక్స్ తోనే మంచి ఫేమ్‌ను తెచ్చుకుంటారు. ఒకింత తక్కువ సినిమాలు చేసినప్పటికీ .. వారి సినిమాల కోసం ఎదురు చూసేవారు చాలా మందే ఉంటారు.

అలా ఇపుడు సౌత్ సినిమా దగ్గర మంచి హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నాచురల్ బ్యూటీ సాయి పల్లవి అని చెప్పాలి. సాయి పల్లవి తన కెరీర్ స్టార్ట్ చేసిన మొదటి సినిమా నుంచే అందరి దృష్టి ఈ చిత్రం ఆకర్షించింది. ఇక తెలుగు సినిమాలో అడుగు పెట్టాక స్టార్‌డమ్‌ను అందుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది.

sai pallavi got a sensational offer with top hero in telugu

ఇక రీసెంట్ గానే తమిళ నాట "అమరన్" అనే సినిమాలో కనిపించి మ్యాజిక్ చేస్తుంది. అయితే కాంట్రవర్సీలు వంటి వాటికి దూరంగా ఉండే సాయి పల్లవి విషయంలో ఈ మధ్య మాత్రం కొంచెం పరిస్థితులు మారాయని చెప్పాలి. ఇలా సినిమాలు , ఇంకో పక్క పలు కాంట్రవర్సియల్ అంశాల్లో సాయి పల్లవి పేరు వినిపిస్తుండగా తనపై ఇపుడు మరో క్రేజీ రూమర్ వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ హైబ్రిడ్ పిల్ల తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ అఫర్ ని సొంతం చేసుకున్నట్టుగా ఇపుడు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆల్రెడీ సాయి పల్లవి హిందీలో భారీ చిత్రం "రామాయణం" చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనికి మించిన సినిమా ఇపుడు సాయి పల్లవి దగ్గరకి వచ్చినట్టుగా వినికిడి. కాగా ఆ సినిమా ఏదో ఎవరితోనో కాదట.

sai pallavi got a sensational offer with top hero in telugu

ఇపుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మెగా హీరో రామ్ చరణ్ తో చేయనుందట. రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో చేయనున్న భారీ సినిమాలో సాయి పల్లవి చరణ్ తో రొమాన్స్ చేయనున్నట్టుగా గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇదే బిగ్గెస్ట్ ఆఫర్ ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర టాప్ దర్శకుడు ఎవరు అంటే ఎవరైనా జక్కన్న రాజమౌళి పేరు చెప్పాల్సిందే.

అలాంటి దర్శకుడే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. సో ఈ సినిమా సాయి పల్లవి కెరీర్ లోనే బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పడంలో డౌట్ లేదుగా? కానీ ఈ సెన్సేషనల్ ఆఫర్ పై మాత్రం ఇంకా అధికారికంగా క్లారిటీ బయటకి రావాల్సి ఉంది. ఇపుడు రామ్ చరణ్.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాతో తన కెరీర్‌లో 16వ సినిమా చేస్తుండగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత 17వ సినిమాగా సుకుమార్ తో సినిమాని రామ్ చరణ్ స్టార్ట్ చేయనున్నాడు. అలాగే సాయి పల్లవి ఇపుడు తెలుగు సహా హిందీ , తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

More from Filmibeat

Read more about: sai pallavi ramayan sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X