మహాసముద్రం కష్టాలు.. హీరోయిన్ ఫిక్స్!
సినిమా పరిశ్రమలో హిట్ కొట్టడం కష్టమనుకుంటే.. వచ్చిన విజయాన్ని కాపాడుకోవడం, ఉపయోగించడం ఇంకాస్త కష్టం. ఎందుకంటే విజయం ఉంటేనే సినీలోకం గుర్తిస్తుంది. అది లేదంటే అక్కడా అంతా శూన్యంగానే కనిపిస్తుంది. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తాన్నిఆశ్చర్యపరిచాడు దర్శకుడు అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 మూవీతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన అజయ్.. రికార్డులు బద్దలు కొట్టాడు.
అయితే మొదటి చిత్రమే అంతటి స్టార్ డమ్‌ను తీసుకువచ్చింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ చిత్రంలో నటించిన హీరో, హీరోయిన్లు ఇప్పటికే మూడు నాలుగుచిత్రాలు చేసి ఉన్నారు. కానీ దర్శకుడిగా అజయ్ మాత్రం తన రెండో సినిమాను పట్టాలెక్కించలేకపోతోన్నాడు. ఎప్పటినుంచో మహా సముద్రం ప్రాజెక్ట్‌ను పట్టుకుని హీరోల చుట్టూ గిరగిరా తిరుగుతున్నాడు.

రవితేజ, నాగ చైతన్య వంటి హీరోల పేర్లు వినిపించాయి. కానీ అవేవీ సెట్ కాలేదు. కార్తికేయ కూడా నో చెప్పినట్టు టాక్. చివరకు ఎలాగోలా శర్వానంద్ ఓకే చెప్పాడని టక్ నడుస్తోంది. ఇంతకాలం హీరో కోసం పాట్లు పడితే.. ఇప్పుడు హీరోయిన్ కోసం వేట కొనసాగిస్తున్నట్టు టాక్. ఈ చిత్రంలో శర్వాకు జోడిగా సాయి పల్లవిని తీసుకుందామని ఈ మేరకు ఆమెకు కథ కూడా వినిపించాడని సమాచారం. ఆమె సమాధానం ఎలా ఉంటుందో చూడాలి. ఒక వేళ ఓకే అంటే మాత్రం శర్వాతో మూడోసారి జతకట్టి అవుతుంది. ఇంతకు ముందు 'పడిపడి లేచె మనసు' సినిమాలో శర్వానంద్, సాయిపల్లవి కలిసి నటించారు. అలాగే కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కించబోయే చిత్రంలోనూ వీరిద్దరూ జంటగా నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











