మహేశ్ బాబు చెల్లిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్: జంటగా కనిపిస్తారనుకుంటే.. ఇలా షాకిచ్చారేంటి!

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో పరిచయం అయినా.. హ్యాండ్సమ్‌ లుక్స్‌తో పాటు అదిరిపోయే యాక్టింగ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే బడా హీరోగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దాదాపు మూడు దశాబ్దాలుగా హవాను చూపిస్తోన్న అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరింతగా దూసుకుపోతున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో యమ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమాను చేయనున్నాడు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హీరో చెల్లెలిగా నటిస్తుందని తెలిసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో మహేశ్

కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో మహేశ్

కొన్నేళ్ల క్రితం పలు ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డ సూపర్ స్టార్ మహేశ్ బాబు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేసిన 'భరత్ అనే నేను' మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే వంశీ పైడిపల్లి రూపొందించిన 'మహర్షి', యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు'తో వరుసగా మూడు విజయాలను అందుకుని హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నాడు.

సర్కారు వారి కోసం పాట పాడడానికి

సర్కారు వారి కోసం పాట పాడడానికి

కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు.

11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ

11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో మూవీ

'సర్కారు వారి పాట' షూట్ జరుగుతుండగానే మహేశ్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబోలో సినిమా రాబోతుండడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా దృష్టి సారించారు.

పనులన్నీ పూర్తి చేసేసిన త్రివిక్రమ్

పనులన్నీ పూర్తి చేసేసిన త్రివిక్రమ్

'అతడు', 'ఖలేజా' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ బాబు చేసే సినిమా కావడంతో.. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఇప్పటికే డైలాగ్ వెర్షన్‌తో కూడిన ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడట. అంతేకాదు, థమన్ కూడా కొన్ని పాటలు రెడీ చేశాడు. మొత్తంగా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది.

మహేశ్ వల్ల మరింత ఆలస్యంగానే

మహేశ్ వల్ల మరింత ఆలస్యంగానే

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు చేయాల్సిన సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, సర్కారు వారి పాట షూటింగ్ మరింత ఆలస్యం అవుతుండడంతో ఇది పట్టాలెక్కలేదు. ఇంతలో ఇటీవలే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ జరిగింది. దీంతో ఈ సినిమా మరింత ఆలస్యంగానే ప్రారంభం కాబోతుంది. లేట్‌గా మొదలైనా వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేస్తారని తెలిసింది.

మహేశ్ సోదరిగా టాలెంటెడ్ భామ

మహేశ్ సోదరిగా టాలెంటెడ్ భామ

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే, ఇందులో మరో హీరోయిన్ కూడా భాగం కాబోతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఇందులో మహేశ్ చెల్లిగా స్టార్ హీరోయిన్ నటించబోతుందట.

హీరోయిన్ అనుకుంటే... ఇలా షాక్

హీరోయిన్ అనుకుంటే... ఇలా షాక్

తనదైన టాలెంట్‌తో సత్తా చాటుతూ.. టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్న హీరోయిన్ సాయి పల్లవి. ఈ బ్యూటీనే మహేశ్ బాబుకు చెల్లెలిగా నటిస్తుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్‌ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని అంటున్నారు. ఆమె కోసం గురూజీ అదిరిపోయే రోల్ క్రియేట్ చేశాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X