Pushpa The Rule: పుష్ప 2లో సాయి పల్లవి.. కథలో ట్విస్ట్ ఇచ్చేలా.. ఏ పాత్ర చేస్తుందో తెలిస్తే షాకే!
బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనలోని అన్ని టాలెంట్లనూ చూపించి బడా హీరోగా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కష్టపడేతత్వం ఉన్న అతడు.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించే ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం 'పుష్ప' అనే మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ చిత్రంతో తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ రెండో భాగంలో సాయి పల్లవి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం!

పాన్ ఇండియా హిట్‌గా పుష్ప
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రమే 'పుష్ప ది రైజ్'. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి అన్ని చోట్లా భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. మొత్తంగా పుష్ప మేనియాతో ఇండియానే కాదు.. ప్రపంచమే షేక్ అయింది.

వందల కోట్లు.. కోట్లలో లాభం
గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందిన 'పుష్ప'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35 కోట్లకు పైగా లాభాలు కూడా దీనికి వచ్చేశాయి.

రూల్ చేయడానికి పుష్ప రెడీ
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో.. రెండో పార్టుపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. దీనిక 'పుష్ప.. ద రూల్' అనే టైటిల్ పెట్టారు. ఇందులో పుష్ప రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని హైలైట్ చేసి చూపించబోతున్నట్లు ఇప్పటికే తెలిసింది. ఈ చిత్రాన్ని అత్యంత మాస్ యాక్షన్‌తో రూపొందించబోతున్నట్లు తెలిసింది.

షూట్ స్టార్ట్... యాక్షన్ షురూ
'పుష్ప' మూవీతో అల్లు అర్జున్‌కు క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అలాగే, త్వరలోనే రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారని అంటున్నారు.

రెండో పార్ట్‌లో సాయి పల్లవి
'పుష్ప ది రూల్' మూవీ గురించి ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఫలానా వాళ్లు కీలక పాత్రలను పోషిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

అలాంటి పాత్రలో హీరోయిన్
వాస్తవానికి 'పుష్ప' మొదటి భాగంలోనే సాయి పల్లవి నటిస్తుందని టాక్ వచ్చింది. కానీ, అలా జరగలేదు. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె ఇందులో ముఖ్యమైన ఓ గిరిజన యువతి పాత్రను చేస్తుందట. అంతేకాదు, ఆమె ఇందులో ఊహించని లుక్‌లో కనిపించబోతుందని, కొన్ని సాహసాలు కూడా చేయబోతుందని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











