విజయ్ దేవరకొండకు ముద్దులివ్వలేక తప్పుకున్న సాయి పల్లవి

Recommended Video

Vijay Devarakonda About Dear Comrade Movie At Bangalore Press Meet || Filmibeat Telugu

సాయి పల్లవి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరిది. 'ఒక్కటే పీస్' అంటూ 'ఫిదా' చేసిన ఈ బ్యూటీ.. 'రౌడీ బేబీ'లా మారి సందడి చేసింది. అందం, అభినయంతో తక్కువ సినిమాలతో ఎంతో చక్కని గుర్తింపును తెచ్చుకుంది. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ తమిళ కుట్టి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అందుకే ఈ హీరోయిన్ డేట్స్ కోసం ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు క్యూ కడుతున్నారు.

 డియర్ కామ్రేడ్ అవకాశం

డియర్ కామ్రేడ్ అవకాశం

యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్'. భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా నటించమని దర్శక, నిర్మాతలు ముందుగా సాయి పల్లవినే సంప్రదించారట. ఆమె ఒప్పుకోకపోవడంతో రష్మిక మందన్నాను తీసుకున్నారు.

ముద్దులివ్వలేకేనని టాక్

ముద్దులివ్వలేకేనని టాక్

సాయి పల్లవికి చిత్ర దర్శకుడు భరత్ కమ్మ స్క్రిప్ట్ మొత్తం వినిపించారట. ఈ కథ కూడా ఆమెకు బాగానే నచ్చిందని తెలిసింది. అయితే, ఇందులో కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు లిప్ లాక్స్ పెట్టడం ఆమెకు నచ్చలేదని సమాచారం. ఈ సీన్స్ ఇప్పటి వరకు చేయని కారణంగా వాటిని తొలగించమని దర్శకుడిని సాయి పల్లవి కోరిందట. కథలో భాగంగా వచ్చే సన్నివేశాలను తీసివేయడానికి దర్శకుడు ఇష్టపడలేదని ప్రచారం జరుగుతోంది.

భారీ ఆఫర్ ఇచ్చినా..

భారీ ఆఫర్ ఇచ్చినా..

వాస్తవానికి ఈ సినిమా చేయడానికి సాయి పల్లవికి నిర్మాతలు భారీ ఆఫర్ ఇచ్చారని ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అయినప్పటికీ లిప్‌లాక్ సన్నివేశాలు నచ్చక ఆమె సినిమా నుంచి తప్పుకుందని చిత్ర సీమలో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమా

ప్రస్తుతం చేస్తున్న సినిమా

సాయి పల్లవి ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల - నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తోంది. తనకు ‘ఫిదా' వంటి సక్సెస్‌ను అందించిన దర్శకుడు కావడంతో ఈమె ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పేసింది. దీనికితోడు, శేఖర్ కమ్ముల కూడా సూపర్ హిట్ చిత్రం తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు నారాయణదాస్‌ నారంగ్‌, రామ్మోహనరావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ మొదలైంది. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. 2019 చివర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X