మహేష్‌కు సాయిపల్లవి ఝలక్.. మరో డైరెక్టర్‌కు చేదు అనుభవం.. ఆ హీరో కోసమే ప్రిన్స్‌కు నో?
దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ తారలు కూడా ప్రిన్స్ అండ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో నటించాలని ఎదురుచూస్తుంటారు. మోస్ట్ చార్మింగ్ హీరో మహేష్ పక్కన నటిస్తే చాలు అని చాలా మంది అందాల భామలు అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అయితే తాజాగా మహేష్ సరసన నటించడానికి ఓ హీరోయిన్ నో చెప్పిందనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సాయిపల్లవి పేరు జవాబుగా మారింది. ఇంతకు ఎందుకు నో చెప్పారనే విషయాన్ని తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

మహేష్‌బాబు సరసన సాయిపల్లవి
మహర్షి సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ నటించే సినిమాకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ చిత్రంలో మహేష్ సరసన సాయిపల్లవి నటింప జేయాలని చిత్ర యూనిట్ భావించింది.

అనిల్ రావిపూడికి నో చెప్పి
జాతీయ మీడియాకు సంబంధించిన వెబ్‌సైట్ కథనం ప్రకారం.. కొత్త హీరోయిన్స్ అయితే బాగుంటుందని దర్శకుడు అనిల్ రావిపూడికి మహేష్ సూచించారట. అంతేకాకుండా సాయిపల్లవి పేరుు స్వయంగా చెప్పడం జరిగిందట. ఆ మేరకు అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లి సాయిపల్లవికి కథను చెప్పగా ఆమె ఈ ప్రాజెక్టులో నటించడానికి నిరాకరించిందట. గతంలో చాలా మంది డైరెక్టర్లకు నో చెప్పిన సందర్భాలు ఉన్న సంగతి తెలిసిందే.

రానా దగ్గుబాటి సినిమాకు డేట్స్
సాయిపల్లవి సాధారణంగా హీరోలతో కాంబినేషన్ కాకుండా తన రోల్, కథలో తన పాత్ర ప్రాధాన్యం చూసుకొంటారని సినీవర్గాల్లో ఓ టాక్ ఉంది. అయితే తాజాగా ఆమె
నటించిన పడి పడి లేచే మనసు, మారి2 బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ప్రస్తుతం తాను నటించే సినిమాల విషయంలో జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా అదే సమయంలో వేణు ఊడుగుల దర్శకత్వంలో రానాతో నటించే విరాటపర్వం సినిమా డేట్స్ క్లాష్ కావడం కూడా ఓ కారణమని చెప్పుకొంటున్నారు.

కత్రినా కైఫ్, రష్మిక కోసం ప్రయత్నాలు
మహేష్ బాబు సినిమాలో సాయిపల్లవి నటించడానికి సుముఖత చూపకపోవడంతో చిత్ర యూనిట్ షాక్ గురైందట. ఆ తర్వాత మహేష్ కోసం హీరోయిన్ వేట మొదలు పెట్టారట. ఆమె స్థానంలో రష్మిక మందన్న, కత్రినా కైఫ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

సుకుమార్‌ను మార్చేసి.. అనిల్ రావిపూడితో
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. రంగస్థలం తర్వాత దర్శకుడు సుకుమార్‌తో ప్రాజెక్ట్ ఫిక్సయినట్టు వార్తలు వచ్చాయి. అయితే కథ పూర్తిగా సిద్ధం కాకపోవడం, ఆలోపే ఎఫ్2 గ్రాండ్ సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడంతో మహేష్ ఈ ప్రాజెక్ట్‌కు సిద్థమైనట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











