కోట్లు ఇస్తామన్నా ఆ హీరోకు సాయి పల్లవి నో చెప్పిందట?
సినిమాల కంటే వివాదాలతోనే సాయి పల్లవి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె గురించి మరో వార్త హాట్ టాపిక్ అయింది. ఓ యంగ్ హీరో సినిమా కోసం ఆమెను సంప్రదించగా నో చెప్పినట్లు సమాచారం. అతడు మరెవరోకాదు... టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.
అల్లుడు శ్రీను సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడైన శ్రీనివాస్... ఇప్పటి వరకు చేసినవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. సమంత, తమన్నా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ హీరోయిన్లకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ హీరోతో చేయించారు.

శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం 'సాక్ష్యం' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. దీని తర్వాత ఇతడు మరో సినిమాకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. మరో ప్రాజెక్టు కూడా లైన్లో ఉన్నట్లు సమాచారం.
ఈ యంగ్ హీరో సినిమా కోసం ఇటీవల సాయి పల్లవిని సంప్రదించారట. ఇప్పటి వరకు సాయి పల్లవి చేసిన సినిమాలన్నింటికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. అయితే కథ నచ్చక పోవడంతో ఈ ఆఫర్ తిరస్కరించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











