సాయి పల్లవి రెమ్యునరేషన్‌పై మరో షాకిచ్చే రూమర్.. అంతకంటే తక్కువకు దిగదట?
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ఒకరిద్దరు తప్పితే బిగ్ బఫ్జెట్ సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ కూడా అవకాశాలు అందుకోవడం లేదు. ఇక సాయి పల్లవి ఈ సమయాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటోంది. రెమ్యునరేషన్ విషయంలో ఈ బ్యూటీ చాలా కటినంగా ఉంటుందని చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. అలాగే అవి అబద్ధమని కూడా కొందరు నిర్మాతలు కూడా తేల్చి చెప్పారు.

అలాంటి వాళ్ళకు పోటీగా..
టాలెంటెడ్ బ్యూటీస్ ఎంతమంది ఉన్నప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకోలేకపోతున్నారు. ఎక్కువగా రష్మీక మందన్న, పూజా హగ్డే వంటి స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రంగా పెరిగింది. అయితే అలాంటి వాళ్లకు సాయి పల్లవి లాంటి బ్యూటీ అప్పుడప్పుడు పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ కేరళ కుట్టి కేవలం తనకు నచ్చిన సినిమాలే చేస్తోంది.

నచ్చకపోతే రిజెక్ట్ చేయడమే..
తనకు నచ్చకపోతే మాత్రం ఎలాంటి హీరోలనైనా రిజెక్ట్ చేయడంలో ఈ బ్యూటీ ముందుంటుంది. ఇక త్వరలో కోలీవుడ్ టాలీవుడ్ అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉందట. ఇక దర్శకుడు తేజ చాలా రోజుల నుంచి ఈ బ్యూటీ డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ రెమ్యునరేషన్ విషయంలో డీల్ సెట్టవ్వడం లేదట.

సాయి పల్లవితో చర్చలు..
దర్శకుడు తేజ గోపీచంద్ తో ఒక సినిమా చేయనున్నట్లు గతంలో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా టైటిల్ అలిమేలుమంగ వెంకటరమణ. అయితే ఆ సినిమా మధ్యలో క్యాన్సిల్ అయినట్లు అలాగే గోపిచంద్ కూడా తప్పుకున్నట్లు కథనాలు వచ్చాయి. ఆ సంగతి అటుంచితే ఇప్పటికే పలుమార్లు దర్శకుడు తేజ సాయి పల్లవికి ఈ స్క్రిప్ట్ పై చర్చలు జరిపినట్లు టాక్ వస్తోంది.
Recommended Video

ఆ రేటుకు ఒప్పుకోవడం లేదట
అయితే అనుకున్న బడ్జెట్ ప్రకారం సాయి పల్లవి రెమ్యునరేషన్ ను 80లక్షలకు అటు ఇటుగా ఫిక్స్ చేశారని టాక్. అయితే ఆమె మాత్రం కోటి మీద మరో 15లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కలు కాస్త కంగారు పెడుతున్నప్పటికి తేజ వెనక్కి తగ్గకుండా సాయి పల్లవిని అనుకున్న రేటుకే ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. మరి ఆ కేరళ కుట్టి ఎంతవరకు ఒప్పుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











