అతనితో లవ్ స్టోరీ నడుపుతూనే జానపద గాయనిగా మారిన సాయిపల్లవి!
నాచురల్ బ్యూటీగా సాయి పల్లవి సూపర్ క్రేజ్ సంపాదించింది. అనతికాలం లోనే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ డమ్ తెచ్చుకొని సౌత్ ఇండియన్ ఆడియన్స్‌ని ఫిదా చేసింది ఈ పక్కింటి అమ్మాయి. ప్రస్తుతం తెలుగులో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న ఈమె.. మరోవైపు విరాటపర్వం సినిమాలోనూ నటిస్తోంది.
దగ్గుబాటి రానా హీరోగా 'విరాటపర్వం 1992' పేరుతో కొత్త సినిమా రాబోతోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సమాచారం. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో జానపద గాయని రోల్ పోషిస్తోందట సాయి పల్లవి. దాదాపు రెండు దశాబ్దాల క్రిందటి పోటిటికల్ బ్యాక్ గ్రౌండ్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో రానా పోషిస్తున్న పాత్ర ఆయన కెరీర్ లోనే చేప్పుకోదగినదై ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

'విరాటపర్వం' చిత్రానికి బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబుతో పాటు సుధాకర్ చెరుకూరి సంయుక్త నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. రానా, సాయి పల్లవి మొదటిసారి జోడీ కడుతున్న ఈ చిత్రం ఇద్దరి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చిత్రయూనిట్ చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
దీంతోపాటు అక్కినేని నాగచైతన్య సరసన 'లవ్ స్టోరీ' సినిమాలో నటిస్తోంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











