»   » నిర్మాత బంపర్ ఆఫర్‌కు నో.. షాకిచ్చిన సాయి పల్లవి.. కారణం అదేనంట..

నిర్మాత బంపర్ ఆఫర్‌కు నో.. షాకిచ్చిన సాయి పల్లవి.. కారణం అదేనంట..

Posted By:
Subscribe to Filmibeat Telugu
బంపర్ ఆఫర్‌కు సాయి పల్లవి నో.. కారణం అదేనంట..!

ఫిదా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న అందాల తార సాయి పల్లవి అటు తమిళంలోనూ, ఇటు తెలుగు, మలయాళంలో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా బిజీ స్టార్ అయిపోయింది. ఫిదా తర్వాత నేచురల్ స్టార్ నానితో నటించిన ఎంసీఏ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. తెలుగులో మంచి పొజిషన్ కల్పించిన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రపోజల్‌ను సున్నితంగా తిరస్కరించిందనే ఓ నిరాధారమైన వార్త ఫిలింనగర్ సర్కిళ్లలో ప్రచారం అవుతున్నది. తనకు టాలీవుడ్‌లో లైఫ్ ఇచ్చిన నిర్మాతతో సాయి పల్లవి అలా ప్రవర్తిస్తుందా అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 సాయి పల్లవికి మరో అవకాశం

సాయి పల్లవికి మరో అవకాశం

ఫిదా బ్లాక్‌బస్టర్ తర్వాత వెంటనే ఎంసీఏ చిత్రంలో నాని పక్కన నటించే అవకాశాన్ని కల్పించాడు దిల్ రాజు. ఈ చిత్రం కూడా పూర్తయి డిసెంబర్ మూడో వారంలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో సాయి పల్లవి డెడికేషన్‌కు ఫిదా అయిన దిల్ రాజు మరో అవకాశాన్ని ఇవ్వాలనుకొన్నారట.

 దిల్ రాజు ఆఫర్‌ రిజెక్ట్

దిల్ రాజు ఆఫర్‌ రిజెక్ట్

ఈ క్రమంలోనే తాను రూపొందించే శ్రీనివాస కల్యాణం చిత్రంలో నటించాలని సాయి పల్లవిని దిల్ రాజును కోరాడట. అందుకు మొహమాటం లేకుండా ఆఫర్‌ను రిజెక్ట్ చేయడం జరిగిందనేది తాజా సమాచారం.

 శ్రీనివాస కల్యాణంలో నితిన్‌తో

శ్రీనివాస కల్యాణంలో నితిన్‌తో

2017లో వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న దిల్ రాజు ప్రస్తుతం హీరో నితిన్, దర్శకుడు సతీష్ వెగ్నేశ చిత్రం శ్రీనివాస కల్యాణం చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ పక్కన నటించాలని సాయి పల్లవికి సూచించడట.

నితిన్ చిత్రానికి సాయి పల్లవి నో

నితిన్ చిత్రానికి సాయి పల్లవి నో

నితిన్ చిత్రంలో నటించడానికి తనకు వీలు కాదని సాయి పల్లవి మర్యాద పూర్వకంగా చెప్పడంతో భారీగా రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడానికి దిల్ రాజు సిద్థపడినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాంతో చేసేది ఏమీలేక సాయి పల్లవి స్థానంలో పూజా హెగ్డేను తీసుకొన్నట్టు తెలిసింది. అయితే క్యారెక్టర్ నచ్చకనే ఆ సినిమా నుంచి తప్పుకొన్నట్టు వార్తలు వచ్చాయి.

 డేట్స్ సమస్య కారణంగానే

డేట్స్ సమస్య కారణంగానే

దిల్ రాజు ఆఫర్‌ను తిరస్కరించడానికి కారణం డేట్స్ సమస్య అని తన సన్నిహితులకు సాయి పల్లవి వివరించినట్టు సమాచారం. మీడియాలో వస్తున్న రూమర్లపై కొంత అసంతృప్తికి లోనైనట్టు సమాచారం. ఎంసీఏ చిత్రంతో పాటు తమిళంలో కరు (తెలుగులో కణం) చిత్రంలో నటించింది.

 హను రాఘవపూడి మూవీలో

హను రాఘవపూడి మూవీలో

ప్రస్తుతం తమిళంలో ధనుష్ సరసన మారి2 చిత్రంలో నటిస్తున్నది. ఇక తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కారణంగానే తాను డేట్స్ అడ్జెస్ట్ చేయలేదని దిల్ రాజు కూడా చెప్పినట్టు సన్నిహితులకు వెల్లడించినట్టు సమాచారం.

English summary
Sai Pallavi was seen alongside Varun Tej in the film Fidaa and it was a grand debut for her. Apparently Dil Raju wanted to give another opportunity to Sai Pallavi in the film Srinivasa Kalyanam that he is going to start with Satish Vegesna. But Sai Pallavi rejected Dil Raju's offer because her dates issue.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu