టాప్ హీరోకి హ్యాండిచ్చిన సాయి పల్లవి? లాస్ట్ మినిట్‌లో నో? ఈ స్టార్ బ్యూటీ ఎస్?

ఒక్క తెలుగు సినిమా దగ్గర అనే కాదు టోటల్ ఇండియన్ సినిమా దగ్గర కూడా ఎలాంటి స్కిన్ షో చేయకుండా టాప్ హీరోయిన్ గా మారడం అలా మారి మంచి ఆఫర్స్ తో కొనసాగడం అనేది చాలా అరుదుగా కొంతమంది హీరోయిన్స్ వరకు మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి అతి కొద్ది మంది హీరోయిన్స్ లో ప్రెజెంట్ జెనరేషన్ లో కనిపించే హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి అని చెప్పవచ్చు.

ఫీమేల్ లీడ్ లో పెర్ఫామెన్స్ పరంగా స్కోప్ ఉన్న పాత్ర అంటే అందులో ఖచ్చితంగా సాయి పల్లవి పేరే ముందు వినిపిస్తుంది. ఇలా ఆమెని వెతుక్కుంటూ చాలా పాత్రలే వెళ్లాయి. కాగా వాటిలో అన్నీ కూడా సాయి పల్లవి ఓకే చేయలేదు. కొన్ని మంచి పాత్రలూ ఉన్నప్పటికీ ఆమె వదులుకుంది. ఇలా తెలుగులో ఆమె పలు సినెమళుక్కు చేస్తూ వచ్చింది.

sai pallavi said no to nithiin but this star beauty said yes

ఇటీవల తండేల్ సినిమాలో కూడా అదిరే పాత్రని ఆమె చేయగా ఈ సినిమా తర్వాత మళ్ళీ తెలంగాణ నేపథ్యంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యింది అన్నట్టుగా పలు రూమర్స్ వచ్చాయి. కాగా బలగం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఒక మరపురాని హిట్ ని అందించిన నటుడు దర్శకుడు వేణు తన నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ కోసం సాయి పల్లవిని అనుకున్నట్టుగా ఎప్పుడు నుంచో టాక్ ఉంది.

కాగా ఈ చిత్రాన్ని టాప్ హీరో నాచురల్ స్టార్ నానితో మొదట అనుకున్నారు కానీ అది కాస్త మరో స్టార్ హీరో నితిన్ దగ్గరకి వెళ్ళింది. కాగా ఇన్ని రోజులు సాయి పల్లవి ఈ సినిమాలో ఉందనే అంతా అనుకున్నారు కానీ కొన్నాళ్లలో సినిమా మొదలు పెట్టనున్నారు అనే మూమెంట్ కి చివరి నిమిషంలో సాయి పల్లవి ట్విస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో సాయి పల్లవి ఈ సినిమా చేయడం లేదని చెప్పేసిందట.

దీంతో ఇది చిత్ర యూనిట్ కి పెద్ద షాక్ గా మారింది. చివరి నిమిషంలో ఆమె పాత్ర పరంగా కొన్ని అంశాల్లో సెట్ కాకపోవడం మూలాన సాయి పల్లవి అందుకు నో చెప్పినట్టుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. తెలంగాణా నేపథ్యంలో సాయి పల్లవిపై వచ్చిన సినిమాలు మంచి ఆదరణ అందుకున్నాయి. దీనితో ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది తన నుంచి మరో మంచి పాత్ర అవుతుంది అని చాలా మంది అనుకున్నారు కానీ ఇపుడు ఈ ఊహించని ట్విస్ట్ మేకర్స్ కి షాకిచ్చింది.

ఇక ఈ పాత్రకి ఇపుడు మరో స్టార్ బ్యూటీ ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. కాగా ఆ హీరోయిన్ మరెవరో కూడా కాదు ఈ మధ్య కాలంలో సౌత్ లో వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ అట. కాగా సాయి పల్లవి వదులుకున్న ఈ పాత్రని కీర్తి ఓకే చేసినట్టుగా తెలుస్తుంది. మరి తన ప్రెజెన్స్ ఈ సినిమాలో ఉందో లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: sai pallavi nithiin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X