Sai Pallavi: ఆ సీన్ చేయమని సాయి పల్లవిపై డైరెక్టర్ ఒత్తిడి.. హీరో అలా అనేసరికి..
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ సంఖ్య చాలానే ఉంది. కానీ వారిలో ఎవరైనసారే ఒక్క ఫ్లాప్ ఎదుర్కొంటే మళ్లీ మరో హిట్టు కొడితే గానీ ఫామ్ లోకి రారు. అంతేకాకుండా వరుసగా రెండు ఫ్లాప్స్ వస్తే చాలు ఐరన్ లెగ్ గా ముద్ర వేస్తారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం సక్సెస్, ఫెయిల్యూర్ తో ఎలాంటి సంబంధం లేకుండా, గ్లామర్ కు తావివ్వకుండా దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో ఫస్ట్ గా చెప్పుకునేది సాయి పల్లవి గురించి. ఇటీవల వరుసగా శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి సినిమాలతో అలరించిన సాయి పల్లవిని ఓ సీన్ చేయమని డైరెక్టర్ చాలా ఒత్తిడి తీసుకొచ్చాడట. అప్పుడు సాయి పల్లవి ఏం చేసిందనే పూర్తి వివరాల్లోకి వెళితే...

ఓపెన్ గానే స్టేజ్ లపై..
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో సాయి పల్లవి ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సక్సెస్, సాయి పల్లవి నటన చూసిన తర్వాత ఆమెతో ఎలాగైన మూవీ చేయాలని స్టార్ దర్శకులు కూడా ఓపెన్ గానే స్టేజ్ లపై చెప్పేశారు. కానీ సాయి పల్లవి మాత్రం తన వద్దకు వచ్చేవారు స్టార్ దర్శకులా చిన్న దర్శకులా అని తేడా చూపించలేదు.

మలయాళం అమ్మాయి అయినప్పటికీ..
కథ నచ్చి, అందులో కంటెంట్ ఉంటేనే సాయి పల్లవి ఓకే అనేది. సాయి పల్లవి మలయాళం అమ్మాయి అయినప్పటికీ రెండు మూడు సినిమాలతో ఆమె తెలుగమ్మాయి అనేంతలా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సాయి పల్లవికి పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ విషయంలో కూడా పెద్దగా అభ్యంతరాలు చెప్పదని టాక్.

అకస్మాత్తుగా రెమ్యునరేషన్ పెంచినట్లు..
అయితే ఆ మధ్య డేట్స్ ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల నాని నేను లోకల్ సినిమాకు అకస్మాత్తుగా రెమ్యునరేషన్ పెంచినట్లు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని నిర్మాత దిల్ రాజు చెప్పేశారు. ఇక సాయి పల్లవి ఒక సినిమా చేయడానికి ఒప్పుకుందంటేనే అందులో మినిమమ్ కంటెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆమెను చూసి సినిమాపై ఇంట్రెస్ట్ చూపించే జనాలు అనేకం.

రొమాంటిక్ సీన్లు లేవని..
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ఒక సినిమాలో ఎలాంటి రొమాంటిక్ సీన్లు లేవని ఒప్పుకుందట సాయి పల్లవి. అయితే సగం సినిమా షూటింగ్ అయ్యాక లిప్ లాక్ సీన్ చేయాలని ఆ మూవీ డైరెక్టర్ సాయి పల్లవిపై ఒత్తిడి తీసుకొచ్చాడట. కానీ అందుకు సాయి పల్లవి అస్సలు ఒప్పుకోలేదట.

హీరో కలుగ చేసుకుని..
అలాంటి సన్నివేశాల్లో చేయనని ముందే చెప్పాను కదా అనే తేల్చి చెప్పేసిందట సాయి పల్లవి. ఇంతలో హీరో కలుగ చేసుకుని.. ఆమెను ఎందుకు ఇబ్బంది పెడతారు. ఆమె చేయను అంటోంది కదా. ఎందుకు ఒత్తిడి చేస్తారు. ఆమె వద్దు అనుకుంటున్నప్పుడు వదిలేయమని డైరెక్టర్ కు ఆ హీరో చెప్పాడట.

మీటూ పేరిట బయట చెబితే..
మళ్లీ ఆమె మీటూ పేరిట బయట చెబితే.. అందరం ఇబ్బందుల్లో పడతాం అని డైరెక్టర్ కు వివరించాడట ఆ హీరో. దీంతో కన్విన్స్ అయిన ఆ దర్శకుడు తర్వాత సాయి పల్లవిని ఇబ్బంది పెట్టలేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. అయితే ఆ మూవీ, ఆ డైరెక్టర్ పేరు చెప్పలేదు సాయి పల్లవి. కాగా మిగతా హీరోయిన్లల గ్లామర్, స్కిన్ షోకి సాయి పల్లవి నో చెబుతుందన్న విషయం తెలిసిందే.ఎలాంటి పాత్ర అయిన తన పరిధి మేరకు మాత్రమే నటిస్తూ దూసుకుపోతోంది ఈ హైబ్రిడ్ పిల్లా.


Click it and Unblock the Notifications











