సాయి పల్లవి లవ్ స్టోరిపై పెరుగుతున్న అంచనాలు.. శేఖర్ కమ్ముల తన స్టైల్‌కు భిన్నంగా!
టాలీవుడ్ లో ఎంతమంది అగ్ర దర్శకులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికీ భిన్నమైన స్టైల్ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒకరి స్టైల్లో మరొకరు సినిమా చేయలేరు. కమర్షియల్ సినిమాలతో అయినా సరే కొంత మ్యాచ్ చేయవచ్చు కానీ కొన్ని డిఫరెంట్ మార్క్ సినిమాలను మాత్రం కొంచెం కూడా మ్యాచ్ చేయలేరు. ముఖ్యంగా శేఖర్ కమ్ముల లాంటి దర్శకుల స్టైల్ ను అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి.

సినిమా కథ ఎలా ఉన్నా కూడా ప్రేక్షకుల మనసుకు చాలా దగ్గరగా ఉండే కథలను రాసుకుంటారు. అంతేకాకుండా సినిమాను స్లోగా నడిపించినా కూడా సన్నివేశాలు మనసును తాకే విధంగా ఉంటాయు. అయితే మరోసారి ఆయన భావోద్వేగమైన కథతో లవ్ స్టోరిని తెరకెక్కించినట్టు తెలిసింది.
ఫిదాను తలపించేలా ఈ సినిమాను తెరకెక్కించారని, సాయిపల్లవి, నాగాచైతన్య కెెరీర్‌లోనే బెస్ట్‌గా ామారే అవకాశం ఉందనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా వినాయకచవితికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల వలన మళ్లీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంతేకాకుండా పోటీలో అదేరోజు టక్ జగదీష్ సినిమా ఓటీటీ కూడా విడుదల కాబోతుంది కాబట్టి ఈ కఠిన పరిస్థితులను సినిమాలు విడుదల చేయడం కరెక్ట్ కాదని డిసైడ్ అయ్యారు. వచ్చేనెల తొలి వారంలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ గురించి అధికారిక చిత్ర యూనిట్ ప్రకటన చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











