సాయి పల్లవి గురించి మరో సంచలన వార్త... ఆ హీరోతో కూడా?
Recommended Video

'ఫిదా' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఈ విషయాల్లో ఆమెపై పాజిటివ్ ఫీడ్ బ్యాకే ఉన్నప్పటికీ... ఆమె పర్సనల్ బిహేవియర్ పరంగా నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు సాయి పల్లవి... నానితో 'ఎంసీఏ', నాగ శౌర్యతో 'కణం' చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. ఈవిడ ప్రవర్తన మూలంగా హీరోలు ఇబ్బంది పడ్డారని వార్తలు వచ్చాయి. తాజాగా ఆమెతో సినిమా చేస్తున్న శర్వానంద్ కూడా సాయి పల్లవితో వేగలేక పోతున్నాడట.

శర్వానంద్, సాయి పల్లవి గొడవ నిజమేనా?
శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచె మనసు' అనే చిత్రం తెరకెక్కుతోంది. సినిమా షూటింగులో సాయి పల్లవి, శర్వానంద్ మధ్య గొడవ జరిగినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి..

గతంలోనూ సాయి పల్లవిపై ఫిర్యాదులు
గతంలోనూ సాయి పల్లవిపై ఇలాంటి ఫిర్యాదులో అందాయి. నాగ శౌర్య... సాయి పల్లవి బిహేవియర్ గురించి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. నాని కూడా ఈవిడ వల్ల ఇబ్బంది పడ్డారనే వార్తలు వచ్చినప్పటికీ దిల్‌రాజు అండ్ టీం ఈ విషయాలను బయటకు పొక్కనివ్వలేదని టాక్.

గతంలో నాగ శౌర్య కామెంట్లపై సాయి పల్లవి
"నాగ శౌర్య నా గురించి చెప్పిన వీడియో చూసి షాకయ్యా. ఆ వెంటనే తనకు ఫోన్ చేశా. కానీ అందుబాటులోకి రాలేదు. శౌర్య చాలా మంచి నటుడు. చాలా కామ్‌గా ఉంటాడు. ఇలా ఎందుకు అన్నాడో అర్థం కాలేదు. నాకు పని తప్ప వేరే ధ్యాస ఉండదు. సెట్లోకి వెళ్తే నా పాత్ర గురించి దర్శకుడితో ఒకటికి పది సార్లు చర్చిస్తా. అది శౌర్యని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. శౌర్యతోనే కాదు, నాకు ఎవరితోనూ గొడవలు లేవు" అంటూ క్లారిటీ ఇచ్చింది.

పడి పడి లేచె మనసు
‘పడి పడి లేచె మనసు' సినిమా విషయానికొస్తే ఈ చిత్రాన్ని హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రసాద్ చుక్కపల్లి-సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. డిసెంబర్ 21న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











