రానా సినిమా నుంచి తప్పుకోలేక.. సాయి పల్లవి షాకింగ్ డెసిషన్
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి - సాయి పల్లవి కలిసి చేస్తున్న చిత్రం 'విరాట పర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రానా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని, అలాగే సాయి పల్లవి మావోయిస్టుగా కనిపించబోతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఇది ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిరోజుల క్రితం చిత్ర యూనిట్ ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుందని వెల్లడించింది. కానీ, సరైన తేదీని మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ప్రస్తుతం రానా విదేశాల్లో ఉన్నాడు. ఆయనకు కిడ్నీకి సంబంధించిన చికిత్స జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ విషయంపై అటు రానా గానీ, ఇటు కుటుంబ సభ్యులు కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో అతడు చేయాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయి. అందులో 'విరాట పర్వం' కూడా ఉంది.
రానా కోసం చూసుకుంటూ ఉంటే మిగిలిన సినిమాల కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేననే కారణంతో సాయి పల్లవి చిత్ర యూనిట్ ముందు ఒక ప్రతిపాదన ఉంచిందట. రానా వచ్చే వరకు తనకు సంబంధించిన షాట్స్ తీసేయాలనేదే దాని సారాంశం అని తెలుస్తోంది. దీనికి చిత్ర బృందం కూడా ఓకే చెప్పేసిందట. దీంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. సాయి పల్లవి ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నాగ చైతన్య సరసన నటించనుంది.


Click it and Unblock the Notifications











