Just In
Don't Miss!
- News
కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Finance
6 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.13 లక్షల కోట్లు జంప్: టీసీఎస్, ఎయిర్టెల్ అదుర్స్
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగా హీరోకు చెల్లెలిగా సాయి పల్లవి.. ఆ పాత్ర కోసం అడిగినంత ఇచ్చారట!
ఫిదా సినిమా తరువాత కేరళ బ్యూటీ సాయి పల్లవి సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంది. మితిమీరిన గ్లామర్ ప్రజెంటేషన్ లేకుండా నటనతో ఎక్కువగా ఆకట్టుకుంటోంది. అయితే చాలా రోజుల తరువాత సాయి ఒల్లవి నెవర్ బిఫోర్ అనే పాత్రలో కనిపించనుందట. అది కూడా అల్లు అర్జున్ సినిమాలో ఒక సోదరి పాత్రలో అని రూమర్స్ వినిపిస్తున్నాయి.

లిప్ లాక్ సీన్..రిజెక్ట్
చాలా కాలం తరువాత సాయి పల్లవి కొన్ని ఇంటర్వ్యూలతో బిజీగా మారుతోంది. తన నుంచి రాబోతున్న సినిమాలకు కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక తనకు ఇష్టమైన లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెబుతూనే మీటూ పై కూడా ఆ మధ్య వివరణ ఇవ్వడం వైరల్ అయిన విషయం తెలిసిందే. ఒక దర్శకుడు లిప్ లాక్ లో నటించమని అడిగితే రిజెక్ట్ చేసిందట.

సాయి పల్లవి ఒప్పుకుందని అంటే..
ఇక ప్రస్తుతం మెయిన్ లీడ్ లోనే కాకుండా కొన్ని ప్రయోగాత్మక సినిమాల్లో సైడ్ రోల్ చేయడానికి కూడా రెడీ అవుతోంది. సాయి పల్లవి ఒక సినిమా చేయడానికి ఒప్పుకుందని అంటే అందులో ఎదో ఒక పాయింట్ హైలెట్ అయ్యేలా చూసుకుంటుంది. అందుకే ఆమె సినిమాలపై నిత్యం ఏదో ఒక టాపిక్ వైరల్ అవుతూనే ఉంటుంది.

అల్లు అర్జున్ సోదరిగా..
ఇక త్వరలో సాయి పల్లవి మెగా స్టైలిష్ స్టార్ కు చెల్లెలి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా హైలెట్ అయ్యేలా ఉండాలని దర్శకుడు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు.

సాయి పల్లవిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు
పుష్ప సినిమాలో దర్శకుడు నసుకుమార్ అల్లు అర్జున్ సోదరి పాత్రకు ఆల్ మోస్ట్ సాయి పల్లవిని ఫైనల్ చేసినట్లు టాక్ వస్తోంది. ఎమోషన్స్ తో పాటు పవర్ఫుల్ సీన్స్ ఉంటాయని అందుకే సిస్టర్ రోల్ కోసం సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ నటిని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

రెమ్యునరేషన్ అడిగినంత ఇచ్చేశారట
ఇక అల్లు అర్జున్ లాంటి హీరోకు సోదరి పాత్రలో నటించడం అంటే డేరింగ్ అనే చెప్పాలి. ఇప్పటికే అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించడానికి దాదాపు రెండు కోట్లు డిమాండ్ చేసిన సాయి పల్లవి పుష్పలో సిస్టర్ పాత్రకు కూడా అదే తరహాలో డిమాండ్ చేసిందట. ఇక నిర్మాతలు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఆమెకు అడిగినంత ఇచ్చినట్లు టాక్ వస్తోంది.