Devara: ఎన్టీఆర్‌తో సాయి పల్లవి.. ఎవరూ ఊహించని పాత్రలో.. అసలు ట్విస్ట్ తెలిస్తే మెంటలెక్కిపోద్ది!
ఈ మధ్య కాలంలో ఏ హీరోకూ సాధ్యం కాని రీతిలో వరుసగా హిట్లను అందుకుంటూ ఫుల్ జోష్‌తో దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయాడు. దీంతో అతడితో ఉత్సాహం రెట్టింపు అయింది. ఫలితంగా మరింత జోష్‌తో వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎన్టీఆర్ తన 30వ చిత్రం 'దేవర'ను చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!
'దేవర'గా మారిన ఎన్టీఆర్:కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేస్తోన్న సినిమానే 'దేవర'. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే, ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

జెట్ స్పీడుతో సాగుతోంది:'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన నాలుగు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇలా వీలైనంత త్వరగా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ఓ రేంజ్‌లో శ్రమిస్తోంది.
కోస్టల్ స్టోరీ.. హై ఓల్టేజ్‌గా:పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న 'దేవర' మూవీ ఇండియాలో ఎవరూ చూడని కోస్టల్ ఏరియా (సముద్ర భాగం)కు సంబంధించిన బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుంది. ఈ విషయాన్ని కొరటాల శివ ముందే రివీల్ చేశారు. అందుకు తగ్గట్లుగానే దీన్ని హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ఇందులో పెడుతున్నారు.

ఇంకొక హీరోయిన్ కూడా:భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'దేవర' చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, దీనిపై చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదనే చెప్పాలి.

ఎన్టీఆర్‌తో సాయి పల్లవి:ఎన్టీఆర్ 'దేవర' మూవీలో మరో హీరోయిన్ కూడా నటించబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కొరటాల శివ టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవితో చర్చలు జరిపినట్లు తెలిసింది. కథ విన్న వెంటనే ఆమె ఇందులో నటించేందుకు ఓకే చెప్పిందట. త్వరలోనే ఆమె గురించి అధికారిక ప్రకటన రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఆ పాత్రలో.. ఎందుకంటే:సాయి పల్లవి 'దేవర' మూవీలో నటిస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆమె పాత్రకు సంబంధించిన ఓ సమాచారం కూడా వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఇందులో ఆమె ఎన్టీఆర్ భార్యగా నటిస్తుందట. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లోనే సాయి పల్లవి కనిపిస్తుందని తెలిసింది. ఈ రోల్ ఎంతో నేచురల్‌గా ఉంటుందట. అందుకే ఆమెను తీసుకుంటున్నారని సమాచారం.

అసలు ట్విస్ట్ అదేనంటూ:'దేవర' మూవీలో ఎన్టీఆర్ డుయల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇందులో అతడు తండ్రి కొడుకు పాత్రలను చేస్తున్నాడట. అయితే, పెద్ద ఎన్టీఆర్‌ను విలన్ గ్యాంగ్ చంపేస్తుందని తెలుస్తోంది. కానీ, అతడి భార్య అయిన సాయి పల్లవిని మాత్రం చంపకుండా ట్విస్ట్ ఇస్తారట. మరి ఆమె ఏమైపోయింది అనేదే ఈ సినిమాలో హైలైట్ అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











