Kalki 2: దీపికా స్థానంలో స్టార్ హీరోయిన్? నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Prabhas's Kalki 2 movie: ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో 'స్పిరిట్', 'ఫౌజి' సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. 'స్పిరిట్' వచ్చే ఏడాది మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తుండగా, 'ఫౌజి' కూడా ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాదికే వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈ రెండు చిత్రాలతో పాటు 'కల్కి 2898 AD: పార్ట్ 2'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే కార్యచరణ మొదలుపెట్టారని, ఫిబ్రవరి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్‌లో ఉన్నారని టాక్. అయితే.. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలిచిన కల్కి 2898 AD సీక్వెల్‌పై ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ మార్పు వార్తలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.

'కల్కి 2898 AD' ఫస్ట్ పార్ట్ లో సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొనే పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే, సీక్వెల్ విషయంలో షెడ్యూల్ ఇష్యూస్, వర్కింగ్ అవర్స్, రెమ్యునరేషన్ వంటి అంశాల కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు 2025 సెప్టెంబర్‌లో అధికారికంగా ప్రకటించారు. దీపిక తప్పుకున్న తర్వాత ఆమె స్థానంలో ఎవరు వస్తారు అన్నదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.
దీపిక ప్లేస్ కోసం మొదట అలియా భట్, ప్రియాంకా చోప్రా, అనుష్క శెట్టి, శ్రద్ధా కపూర్, కల్యాణి ప్రియదర్శన్ పేర్లు వినిపించాయి. ముఖ్యంగా ప్రియాంకా చోప్రా పేరు గట్టిగా ప్రచారంలోకి వచ్చినా, భారీ రెమ్యునరేషన్ కారణంగా ఆ ఆప్షన్ డ్రాప్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా బజ్ ఏంటంటే... ఈ కీలక పాత్రకు సాయి పల్లవి (Sai Pallavi) పేరు బలంగా వినిపిస్తోంది. సాయి పల్లవి తెలుగింటి అమ్మాయిగా సహజ నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలిచింది. సాయి పల్లవి అయితే 'కల్కి 2' స్టోరీకి, ప్రభాస్‌కు జోడీగా సెట్ అవుతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఇది ఇప్పటికీ రూమర్ మాత్రమే, అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.
ఇండస్ట్రీ వర్గాల మాటల్లో చెప్పాలంటే.. 'కల్కి 2' హిందీ బెల్ట్‌లో కూడా భారీ ప్రభావం చూపాలంటే హీరోయిన్ ఎంపిక కీలకం. అందుకే మేకర్స్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ నుంచి, అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ నుంచి త్వరలోనే అధికారిక అప్‌డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
2024లో విడుదలైన 'కల్కి 2898 AD' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ సెన్సేషన్‌గా నిలిచింది. ఆ అంచనాలను మించేలా సీక్వెల్‌ను తెరకెక్కించాలనే లక్ష్యంతో మేకర్స్ ఉన్నారు. అయితే హీరోయిన్ ఫైనలైజేషన్ ఆలస్యం కావడంతో షూటింగ్ ప్రారంభానికి ఇంకా కొంత టైమ్ పట్టే అవకాశాలున్నాయి. మొత్తానికి దీపికా పదుకొనే ఔట్ అయిన తర్వాత సాయి పల్లవి ఇన్ అవుతారా? లేక మరో స్టార్ హీరోయిన్ పేరు తెరపైకి వస్తుందా? అన్నది మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకూ సస్పెన్స్‌గానే ఉండనుంది. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం... 'కల్కి 2898 AD: పార్ట్ 2'పై హైప్ మాత్రం రోజురోజుకీ పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











