పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమాలో రౌడి బేబి.. నిజంగానే బంపర్ ఆఫర్!
పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన రూమర్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మలయాళం కథను రీమేక్ చేస్తున్న పవన్ షూటింగ్ కోసం కేవలం 25రోజుల కాల్షీట్స్ మాత్రమే కేటాయించారట. అయ్యప్పన్ కొశీయుమ్ సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరో హీరో పాత్ర ఎవరు చేస్తారనే విషయంలో కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాలో సాయి పల్లవి కూడా నటించబన్నట్లు మరో టాక్ వస్తోంది. ఆమె పవన్ కళ్యాణ్ భార్య పాత్రల్లోనే నటించనుందట. ఫిదా సినిమాలో పవర్ స్టార్ అభిమానిగా నటించిన సాయి పల్లవి ఇప్పుడు రియల్ గా ఆయన భార్యగా నటించనుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టొరీ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఆ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. గ్లామర్ హాట్ రోల్స్ కి దూరంగా ఉంటూనే సాయి పల్లవి కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే మెప్పిస్తోంది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకోవడంతో అమ్మడి ఫ్యూచర్ మరో రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు. త్వరలోనే అయ్యప్పన్ కొశీయుమ్ కి సంబంధించిన మరో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











