మెగా హీరో షాకింగ్ డెసిషన్.. సినిమాలకు బ్రేక్, కారణం ఇదే!

Recommended Video

Sai Dharam Tej Will Stop Doing Movies For A While

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్ ఆరంభంలో మెరుపులా దూసుకువచ్చాడు. అటు మెగాస్టార్, ఇటు పవర్ స్టార్ పోలికలతో, అదేవిధంగా నటన డాన్స్ లలో ఉత్సాహం కనిపించడంతో మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ వచ్చాడని అంతా అనుకున్నారు. సుప్రీం చిత్రం వరకు తేజు అడుగులు అలాగే పడ్డాయి. ఆ తరువాత కథల ఎంపిక సరిగా లేకపోవడంతో తేజు సినిమాలు వరుసగా పరాజయం చెందుతూ వచ్చాయి. వరుస ఫైల్యూర్స్ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తేజ్ ఐ లవ్ యూ కూడా

తేజ్ ఐ లవ్ యూ కూడా

వివి వినాయక్ తెరకెక్కించిన ఇంటిలిజెంట్ చిత్రంతో తేజుపై విమర్శలు ఎక్కువయ్యాయి. కథల ఎంపిక విషయంలో పరిణితి ప్రదర్శించాలని సినీ విమర్శలకుల సూచించారు. ఆ తరువాత తొలిసారి చేసిన ప్రేమ కథాచిత్రం తేజ్ ఐ లవ్ యూ కూడా నిరాశనే మిగిల్చింది.

 కీలక నిర్ణయం

కీలక నిర్ణయం

సాయిధరమ్ తేజ్ వరుస ప్లాపుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని తేజు భావిస్తున్నాడట. ఆలస్యంగా అయినా ఈ సారి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

యూఎస్ పయనం

యూఎస్ పయనం

ఇందులో భాగంగానే తేజు మొదట తన మేకోవర్ మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సరికొత్త లుక్ కోసం తేజు యూఎస్ వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నుంచి అన్ని అంశాలలో విభిన్నత ప్రదర్శించాలనేది తేజు ఆలోచనగా చెబుతున్నారు.

కిషోర్ తిరుమల చిత్రం

కిషోర్ తిరుమల చిత్రం

సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రంలో భాగంగా కిషోర్ తిరుమల చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రం ఆగస్టు నుంచి మొదలు కావలసి ఉంది. కానీ తేజు తీసుకున్న నిర్ణయం వలన ఈ చిత్ర షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 అక్టోబర్ వరకు

అక్టోబర్ వరకు

తేజు అక్టోబర్ వరకు యుఎస్ లోనే ఉండబోతున్నాడట. తేజు తిరిగి వచ్చాకే నెక్స్ట్ మూవీ పట్టాలెక్కేది. కిషోర్ తిరుమల చిత్రంలో తేజు సరసన రితిక సింగ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X