గీత గోవిందం డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా.. హిట్టు కొట్టాలంటే!
Recommended Video

గీత గోవిందం చిత్రంతో పరశురామ్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలనీ ఆసక్తి చూపుతున్నారు. గీత గోవిందం చిత్రం టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉంది. శ్రీరస్తు శుభమస్తు చిత్రం తర్వాత రెండవసారి కూడా పరశురామ్ గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే సినిమా చేశాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ మూవీకి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదే బ్యానర్‌లో
గీత గోవిందం చిత్రం తరువాత పరశురామ్ తదుపరి చిత్రం గురించి చర్చ మొదలైంది. ఈ దర్శకుడు ఏ హీరోతో సినిమా చేస్తాడో అని అభిమానులు చర్చించుకుంటున్న సమయంలో ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. పరశురామ్ తదుపరి చిత్రం కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉండనుందట. పైగా ఓ మెగా హీరోతో సినిమాకు పరశురామ్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

సాయిధరమ్ తేజ్
పరశురామ్ తదుపరి చిత్రం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదివరకే పరశురామ్ తేజు కోసం కథని సిద్ధం చేశాడట. అన్ని కుదిరితే ఈ కాంబినేషన్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కిషోర్ తిరుమల
తేజు ప్రస్తుతం నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. సాయిధరమ్ తేజ్ కు అర్జెంట్ గా హిట్ కావాలి. ఇటీవల తేజ్ నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. కిషోర్ తిరుమల తెరకెక్కించే చిత్రంపై కాన్ఫిడెంట్ గానే ఉన్నా.. ఈ తరుణంలో కెరీర్ కు ఊపు నిచ్చే విజయం సాధించాలంటే పరశురామ్ లాంటి దర్శకుడు అవసరం.

సరికొత్తగా
తేజు ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోయే చిత్రలహరి చిత్రం కోసం మేకోవర్ చేంజ్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో తేజు సరికొత్త లుక్ లో కనిపిస్తాడట. ఇక పరశురామ్ చిత్రం గురించి అధికారికంగా ప్రకటన రావలసి ఉంది.


Click it and Unblock the Notifications











