Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
'టెన్షన్'లో సాయిధరమ్, వరుణ్ తేజ్: ఆ హీరోయిన్ వల్లే?.. ఏం జరుగుతోంది..
Recommended Video
సినిమా విడుదలకు తేదీతో సహా అన్నీ పక్కాగా ఖరారు చేసుకున్న సమయంలో.. మరో పెద్ద సినిమా కూడా అదే తేదీకి రాబోతుందని తెలిస్తే కచ్చితంగా టెన్షన్ పెరగడం ఖాయం. మెగా కాంపౌండ్ హీరోలకు ఇప్పుడిదే భయం పట్టుకుంది. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ సినిమాల విడుదల రోజే.. 'పద్మావతి' విడుదలవుతుండటం వారిలో ఆందోళన పెంచుతోంది..
ఫిబ్రవరి 9న..:
సాయిధరమ్ తేజ్-వినాయక్ కాంబినేషన్లో వస్తున్న ఇంటలిజెంట్, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'తొలిప్రేమ' సినిమాలు ఫిబ్రవరి 9న విడుదలకు ప్లాన్ చేసుకున్నాయి. కానీ అదే రోజు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 'పద్మావతి' కూడా బరిలో దిగుతుండటంతో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లలో ఆందోళన నెలకొంది.
'పద్మావతి'కి ఫుల్ క్రేజ్..:
వివాదాల పుణ్యమాని పద్మావతికి సౌత్ ఇండియాలోనూ కావాల్సినంత పాపులారిటీ వచ్చింది. ఎప్పుడైతే సీన్ లోకి రాజ్ పుత్ కర్ణీ వర్గం ఎంటరైందో అప్పటినుంచి ఈ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ వస్తోంది. ఒక రకంగా సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల ఎటెన్షన్ క్రియేట్ అయింది. ఇందుకు తగ్గట్లే సౌత్ ఇండియాలోనూ భారీ విడుదలకు ప్లాన్ చేశారు నిర్మాతలు.
ఓపెనింగ్స్‌కు దెబ్బే..:
పద్మావతితో పాటు బరిలో దిగితే ఓపెనింగ్స్ కు దెబ్బ పడవచ్చునని సాయిదరమ్ తేజ్, వరుణ్ తేజ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎటూ పద్మావతి సినిమానే ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ గా ఉంటుంది.. దానికి తోడు సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. జనాలంతా ఇక అటువైపే 'క్యూ' కట్టేస్తారు. కాబట్టి పద్మావతితో బరిలో దిగడం సరైందేనా? అన్న అంతర్మథనం కూడా వారిలో మొదలైనట్లు తెలుస్తోంది.
ఎట్టకేలకు 'పద్మావతి' విడుదల..:
పద్మావతి విషయానికొస్తే.. ఇటీవలి కాలంలో ఇంతలా వివాదాస్పదమైన సినిమా మరొకటి లేదు. రాజకీయంగానూ ఈ సినిమా పెద్ద దుమారమే లేపింది. సెన్సార్ బోర్డు సూచనల మేరకు కొన్ని సీన్లు తొలగించడానికి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఒప్పుకోవడంతో.. ఎట్టకేలకు సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
సాయిధరమ్ 'ఇంటలిజెంట్..':
ఖైదీ నంబర్ 150 లాంటి సూపర్ హిట్ తర్వాత వినాయక్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో 'ఇంటలిజెంట్'పై మంచి అంచనాలే ఉన్నాయి. తొలుత ఈ సినిమాకు ధర్మాభాయ్, దుర్గ లాంటి టైటిల్స్ వినిపించినా.. చివరకు 'ఇంటలిజెంట్' టైటిల్ కే ఫిక్స్ అయిపోయారు.
వరుణ్ తేజ్ 'తొలిప్రేమ':
బాబాయి పవన్ కల్యాణ్ కెరీర్ లో ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన 'తొలిప్రేమ'తో వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. ఆ టైటిల్ కు ఎంతవరకు న్యాయం చేయగలడన్నది తెర మీదే చూడాలి. 'తొలిప్రేమ' టైటిల్ తోనే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. మంచి కథా, స్క్రీన్ ప్లే కుదిరితే ఈ సినిమాతో వరుణ్ ఖాతాలో మంచి హిట్ పడ్డట్లే.