సైఫ్-కరీనా పెళ్లి కోర్టులోనా?
ముంబై: సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లవ్ అండ్ అఫైర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ జంట కోర్టులో పెళ్లి చేసుకోబోతున్నట్ల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరు కోర్ట్ మ్యారేజ్ కోసం అప్లై చేసుకున్నట్లు సమాచారం. ముంబై మిర్రర్ కథనం ప్రకారం...సెప్టెంబర్ 12న బాంద్రాలోని మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్‌ను సైఫ్-కరీనా సందర్శించారు. మ్యారేజ్ కోసం అప్లై చేసుకున్నారు. దీన్ని బట్టి వాళ్లు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవచ్చే వార్తలు వినిపిస్తున్నాయి.
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం అక్టోబర్ 17 వీరి వివాహం బాంద్రా రిజస్టర్ ఆఫీసులో ఉంటుందని స్పష్టం అవుతోంది. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ ఇప్పటికే తన సన్నిహితులు, ఫ్రెండ్స్‌కి అక్టోబర్ 18న దావత్(విందు) ఏర్పాటు చేసారు. నాలుగైదేళ్లుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సైఫ్ అలీఖాన్‌కు పెళ్లీడుకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. అలాంటిది ఆయన కరీనాతో పెళ్లికి రెడీ అవుతుండటం... దానికి కరీనా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఓకే చెప్పేయడం విశేషం.
ఇక కరీనా నటించిన 'హీరోయిన్' చిత్రం ఈరోజు విడుదలైన బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. బార్ గర్ల్స్, మోడల్స్ జీవితాలు తెర వెనక ఎలా ఉంటాయి అని తన గత చిత్రాలో కళ్లకు కట్టినట్లు చూపించిన దర్శకుడు మధుర్ బండార్కర్...ఈ సారి హీరోయిన్ల జీవితాల్ని 'హీరోయిన్' చిత్రం చూపించారు.


Click it and Unblock the Notifications











