ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ స్టార్: ప్రభాస్ తర్వాత యంగ్ టైగర్‌తో ఫైట్‌కు రెడీ
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRRలో నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇది ఎప్పుడో ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ దానికి సంబంధించిన అప్‌డేట్ మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడట. ఈ సినిమాలో విలన్ పాత్ర ఎంతో స్టైలిష్‌గా ఉంటుందట. దీని కోసం హిందీ పరిశ్రమకు చెందిన హీరోనే తీసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే సంజయ్ దత్ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత సునీల్ శెట్టిని కూడా పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైఫ్ అయితే బాగుంటుందని గురూజీ ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అతడితో చిత్ర యూనిట్ చర్చలు కూడా జరిపినట్లు ఫిలిం నగర్ ఏరియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్'లో రావణ బ్రహ్మగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ మూవీ ఓకే అయితే.. ఎన్టీఆర్‌తోనూ ఫైట్ చేసే అవకాశాలూ ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను న్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది.


Click it and Unblock the Notifications











