Devara: విలన్ రోల్‌పై క్రేజీ లీక్.. ఆ ట్విస్టు తర్వాత ఎన్టీఆర్‌కు మైండ్ బ్లాక్
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో పాన్ ఇండియా సినిమాలు రూపొందుతోన్నాయి. అందులో కొన్ని మాత్రమే అదిరిపోయే బజ్‌తో అంచనాలను అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నాయి. అలాంటి చిత్రాల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీ ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశం అంత ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చిలోనే ప్రారంభించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన మూడు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు.

ఈ క్రమంలోనే త్వరలోనే నాలుగో దాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇలా నవంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పార్టు మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్‌గా పెట్టుకుని శరవేగంగా పని చేసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చేసింది.
పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న 'దేవర' మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఆయన పాత్ర మొదటి సగం మొత్తం ఎంతో డీసెంట్‌గా ఉంటుందట. కానీ, ఇంటర్వెల్ ముందు అతడిలోని వైల్డ్ యాంగిల్ బయటకు వస్తుందని తెలిసింది.
అదే ఈ సినిమాలో మేజర్ ట్విస్ట్ అని అంటున్నారు. సైఫ్ రోల్ రివీల్ అయినప్పుడు ఎన్టీఆర్ పాత్ర మైండ్ బ్లాక్ అయ్యేలా సీన్ డిజైన్ చేశారట. ఇదంతా సినిమాలో హైలైట్‌గా ఉండబోతుందని అంటున్నారు. దీంతో సైఫ్ పాత్రపై అంచనాలు పెరుగుతున్నాయి.
'జనతా గ్యారేజ్' వంటి సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తారని ఎప్పుడో ప్రకటించారు.


Click it and Unblock the Notifications











