Devara 2, Spirit కు భారీ దెబ్బ.. సైఫ్ అలీఖాన్ దాడితో ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలకు నష్టం ఎంతంటే?

Saif Ali Khan: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో చిత్ర సీమ ఉలిక్కిపడింది. గురువారం ఉదయం సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు అతనిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో సైఫ్ అలీ ఖాన్ అప్ కమింగ్ మూవీస్ పై ఎఫెక్ట్ పడబోతుంది. సైఫ్ అలీ ఖాన్ రాబోయే చిత్రాల షూటింగ్ మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రధానంగా ఎన్టీఆర్ దేవర 2, ప్రభాస్ స్పీరిట్ కు భారీ దెబ్బపడబోతుందట. సైఫ్ అలీఖాన్ దాడితో ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలకు నష్టం ఎంతంటే?

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జనవరి 16న తెల్లవారుజామున దాడి జరిగింది. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ దాదాపు 6 చోట్ల తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అటువంటి పరిస్థితిలో సైఫ్ అలీ ఖాన్ రాబోయే చిత్రాల షూటింగ్ మధ్యలో ఆగిపోయే ప్రమాదముందని పలు నివేదికలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలతో నిర్మాతలకు వేల కోట్ల నష్ఠం వచ్చే అవకాశముందని, ఆ సినిమాల షూటింగ్ నిలిచిపోయేలా ఉన్నాయి.

Saif Ali Khan s upcoming films Devara 2 Spirit and other projects that could be affected by the attack
హీరో సైఫ్ అలీఖాన్‌ చేతిలో ప్రస్తుతం 9 సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు 2025లో విడుదల కాబోతుండగా.. గో గోవా గాన్ 2 నుండి స్పిరిట్ వరకు సైఫ్ అలీ ఖాన్ 9 సినిమాలు ఉన్నాయి. అవే.. గో గోవా గాన్ 2, రేస్ 4, షూటౌట్ ఎట్ బైకుల్లా, ప్రియదర్శన్‌తో ప్రాజెక్ట్, సారా అలీ ఖాన్‌తో సైఫ్ ప్రాజెక్ట్, జ్యువెల్ థీఫ్, ఇక టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ దేవర 2, ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబో మూవీ స్పిరిట్ వంటి పలు సినిమాలున్నాయి.

ఇందులో ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా,కొరటాల శివ దర్శకత్వంలో దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవర 2. ఈ సినిమాపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దేవర 1 సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భైరవ అని నెగటివ్ రోల్ లో నటించారు. ఈ పాత్రలో సైఫ్ ఒదిగిపోయారు. తన నటనకు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న దేవర 2 సినిమాలో కూడా సైఫ్ పాత్ర ఉండబోతుంది. ఈ పాత్ర చుట్టూ స్టోరీ తిరగబోతుంది. ఒకవేళ సైఫ్ అలీ ఖాన్ ఈ ప్రమాదం నుండి కోల్కోకపోతే దేవర మూవీ మేకర్స్ కు భారీ నష్టం చేకూరే అవకాశం ఉంది.

Saif Ali Khan s upcoming films Devara 2 Spirit and other projects that could be affected by the attack

ఇకపోతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమా కూడా సైఫ్ అలీ ఖాన్ పై దాడి తో ప్రభావితమయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం స్పిరిట్ మూవీని 2025 చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ గాయం కారణంగా మూవీ షూటింగ్లో ప్రస్తుతం పాల్గొనే అవకాశం లేదనే చెప్పాలి. మరీ ఆ క్యారెక్టర్ ను రిప్లై చేసి వేరే నటుడిని తీసుకోబోతున్నారా? లేక సైఫ్ అలీ ఖాన్ తిరిగి సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చేంతవరకు ఆగబోతున్నారా? అనేది మూవీ మేకర్స్ పై ఆధారపడి ఉందని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలలో నటించాలని ఆయన అభిమానులు మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: saif ali khan devara 2 spirit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X