డేటిచ్చేసారు...ఇదేనా ఆడుతుందా?
హైదరాబాద్ : హీరో కెరీర్ వరస ప్లాపుల్లో నడుస్తున్నప్పుడు వాళ్ల తాజా సినిమాలకు బిజినెస్ జరగవు. ధైర్యం చేసి సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సిందే. లేదా పరిచయస్తుల ద్వారా విడుదల చేయాలి. ఇప్పుడు సాయిరామ్ శంకర్ సినిమాల పరిస్ధితి అలాగే నడుస్తోంది. ఆయన సినిమాలు గత కొంత కాలంగా ఆడటం లేదు. ఈ నేపద్యంలో ఆయన కొత్త సినిమా రిలీజ్ డేట్ ఇవ్వడంతో అంతా ఆకక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా అయినా ఆడితే అతనిమీద పెట్టుబడి పెట్టడానికి మరికొంతమంది ధైర్యం చేస్తారంటున్నారు.

సాయిరామ్‌శంకర్, అడోనిక జంటగా నటించిన చిత్రం 'రోమియో'. పూరి రాసిన ప్రేమకథ అనేది ఉపశీర్షిక. కథానాయకుడు రవితేజ అతిథి పాత్రలో నటించారు. గోపీగణేష్ దర్శకుడు. దొరైస్వామి నిర్మాత. ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ ''ఓసారి వెరోనా వెళ్లినప్పుడు రాసుకున్న కథ ఇది. సినిమా బాగా వచ్చింద''న్నారు.
''నేను, సాయిరామ్‌శంకర్ కలసి 'ఇడియట్'కి పని చేశాం. ఆ తర్వాత సాయి హీరోగా సినిమా చేద్దామని ఆలోచన వచ్చి పూరిగారు అందించిన కథతో తెరకెక్కించాము''అన్నారు దర్శకుడు. అందరికీ నచ్చే చిత్రమవుతుందన్నారు నిర్మాత. అక్టోబరు 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు చిత్ర సమర్పకుడు మధుర శ్రీధర్.


Click it and Unblock the Notifications











