Saiyaara Day 3 Box Office : 100 కోట్ల క్లబ్ లోకి సైయారా.. బాక్సీఫీస్ వద్ద సునామీ.. 3వ రోజు ఎన్ని కోట్లంటే?
బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ చిత్రం సైయారా మంచి వసూళ్లను అందుకుంటోంది. 3 రోజులుగా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుని ఆశ్చర్య పరుస్తోంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించారు. ఆషికీ 2 దర్శకుడు మోహిత్ సూరి డైరెక్ట్ చేయడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్యా చోప్రా సమర్పించగా అక్షయ్ విధాని నిర్మించారు. అనన్య పాండే సోదరుడు ఆహాన్ పాండే, సలాం వెంకీ ఫేమ్ అనీత్ పడ్డా జంటగా నటించడం విశేషం. ఈ సందర్భంగా సైయారా మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 3వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు ఎన్ని కోట్లు అనే వివరాల్లోకి వెళితే..
సైయారా సినిమా బడ్జెట్ ఎంత?
స్టార్ హీరోలకు చెందిన నటీనటులు, స్టార్ కాస్ట్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. మ్యూజికల్ డ్రామా కావడంతో సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారు. చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని గ్రాండ్ గా తీర్చి దిద్దేందుకు టెక్నీషియన్లు ప్రయత్నించారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులను కలుపుకొని సినిమాకు రూ.60 కోట్ల బడ్జెట్ జరిగిందని ట్రేడ్ పండితులు వెల్లడించారు.

సైయారా మూవీ బ్రేక్ ఈవెన్?
మోహిత్ సూరి దర్శకత్వంలో మ్యూజిక్ డ్రామాగా ఇప్పటికే ఆషికీ 2 రావడం, యంగ్ యాక్టర్స్ లీడ్ రోల్స్ లో నటించడం, ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్స్ ప్రచారం చేయడం, ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ భారీగా హిట్ కావడంతో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. వరల్డ్ వైడ్‌గా 8000 స్క్రీన్లలో విడుదలైంది. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ. థియేట్రికల్ రన్ ద్వారా రూ.120 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
సైయారా 2 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్..
ఈ చిత్రానికి ఓపెనింగ్ డే భారీగా వసూళ్లు అందాయి. తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ.27.75 కోట్ల గ్రాస్, 2వ రోజు రూ.25 కోట్లు వసూళ్లు చేసింది. కేవలం 2 రోజుల్లో మొత్తంగా రూ.52 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. ఇక ఇందులో నుంచి ఓవర్సీస్ లో తొలి రోజు రూ.3 కోట్లు, 2వ రోజు రూ.9 కోట్లు గ్రాస్ వసూల్ చేయడం ఆసక్తికరంగా మారింది.
సైయారా 3వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు..
సైయారా చిత్రం 3వ రోజు బాక్సాఫీస్ వద్ద మరింత దూకుడుగా ఉంది. మార్నింగ్ షూస్, ఆఫ్టర్ నూన్ షోల ద్వారా ఓవరాల్ గా 58.62 శాతం థియేటర్ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇక ఈవెనింగ్, నైట్ షోలకు మరింతగా ఫూట్ ఫాట్ పెరిగే అవకాశం ఉంది.
కాగా 3వ రోజు రూ.24.17 కోట్ల ఇండియా నెట్ ను వసూల్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 3వ రోజు రూ.40 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కాగా 3 రోజుల్లోనే సైయారా చిత్రం 92 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఈ సినిమా 4వ రోజు 100 కోట్ల క్లబ్‌లో చేరుతుండటం విశేషంగా మారింది. 4వ రోజు వసూళ్లతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ కానుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











