Ustaad Bhagat Singh: పవన్ సినిమాలో మరో బ్యూటీ.. లక్కీ ఛాన్స్ పట్టేసిందిగా!
టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో చేయనంత రాకెట్ వేగంతో సినిమాలు చేస్తూ.. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీఎంట్రీలో తనలోని కొత్త కోణాన్ని చూపిస్తోన్న అతడు.. ఇప్పుడు ఏకంగా నాలుగు చిత్రాలను చేస్తున్నాడు. అందులో ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమానే 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ఇటీవలే మొదలు పెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మిగిలిన షెడ్యూళ్లను కూడా పక్కా ప్లాన్‌తో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు కూడా వైజాగ్‌లో ఓ నైట్ షెడ్యూల్‌ను జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో పవన్ కల్యాణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుందని అనుకున్నారు. కానీ, ఆమెను తప్పించి శ్రీలీలను తీసుకున్నారు. ఇక, ఇప్పుడు ఇందులో మరో హీరోయిన్‌ను సైతం భాగం చేస్తున్నారని తెలిసింది. ఆమె ఎవరో కాదు.. అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాక్షి వైద్య. ఈ బ్యూటీనే ఇప్పుడు పవన్ సినిమాలో కీలక పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది. అంతేకాదు, ఆమె హీరోను ప్రేమించే అమ్మాయిగా కనిపించబోతుందని సమాచారం.

ఇక, 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా కొన్ని మార్పులతో తెరకెక్కుతోంది. ఇందులో అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి నటీనటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











