Ustaad Bhagat Singh: పవన్‌తో వరుణ్ గర్ల్‌ఫ్రెండ్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా స్టార్ హీరో ఒక సినిమా చేయాలంటే ఏడాది సమయం అయినా పడుతుంది. అలాంటిది టాలీవుడ్‌లోని బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస మూవీలతో దూసుకుపోతోన్నాడు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత యమ జోష్‌లో కనిపిస్తోన్న ఈ మెగా హీరో.. ఇప్పటికే కొన్ని సినిమాలతో వచ్చి ప్రేక్షకులను, అభిమానులను అలరించాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. 'గబ్బర్ సింగ్' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ స్టార్ హీరో చేస్తున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మిగిలిన షెడ్యూళ్లను కూడా పక్కా ప్లాన్‌తో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు పవన్ డేట్స్ కారణంగా కాస్త బ్రేక్ తీసుకున్నారు.
మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో పవన్ కల్యాణ్ సరసన పూజా హెగ్డే చేయాల్సి ఉంది. కానీ, ఆమెను తప్పించి శ్రీలీలను తీసుకున్నారు. ఇక, ఇప్పుడు ఇందులో మరో హీరోయిన్‌ను సైతం ఎంపిక చేసినట్లు తెలిసింది. ఆమె ఎవరో కాదు.. 'ఏజెంట్' ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు వరుణ్ తేజ్‌తో 'గాండివధారి అర్జున'లో నటించిన సాక్షి వైద్య. ఈ బ్యూటీ పవన్ సినిమాలో భాగం అయిందట.

ఫిలిం నగర్ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో సాక్షి వైద్య పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుందట. ముందు మంచి షేడ్స్ ఉన్న అమ్మాయిలనే కనిపిస్తూ పవన్ పాత్రను లవ్ చేసి.. ఆ తర్వాత తనలోని నెగెటివిటీని బయట పెడుతుందట. అప్పుడు వచ్చే ట్విస్ట్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకు వెళ్తుందని తెలిసింది.
ఇదిలా ఉండగా.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇందులో అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్‌లు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications










