Salaar టీజర్ డేట్ ఫిక్స్ అయినట్లే.. ఆ రోజే ఫ్యాన్స్ కు అసలైన సర్‌ప్రైజ్
ఆదిపురుష్ హడావిడి అయిపొయింది. సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. సినిమా హిట్, ఫ్లాప్ అనేది మరికొద్ది రోజుల్లో ప్రేక్షకాదరణ బట్టి తెలిసిపోతుంది. వీకెండ్ కాబట్టి ఆదివారం కూడా వంద కోట్ల గ్రాస్ ని క్రాస్ చేయొచ్చు. అయితే సోమవారం నుంచి డిమాండ్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఆదిపురుష్ సినిమా కారణంగా ప్రభాస్ సలార్ అప్డేట్స్ లేట్ అవుతున్నాయనేది ఫ్యాన్స్ అభిప్రాయం.
అయితే ఆదిపురుష్ రిలీజ్ కావడంతో సలార్ కి లైన్ క్లియర్ అయ్యింది. కేజీఎఫ్ సిరీస్ లాంటి మాస్ యాక్షన్ మూవీ చేసిన ప్రశాంత్ నీల్ నుంచి రాబోతోన్న సినిమా కావడంతో దానిపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. సలార్ రెండు భాగాలుగానే రాబోతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో అతను సలార్ గా ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తోంది.

ఒక వేళ టీజర్ పై క్లారిటీ ఇస్తే మాత్రం ఫ్యాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేసే అవకాశం ఉంది. సలార్ మూవీ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతోంది. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సలార్ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ కారణంగా ఆయన చేసే ప్రతి సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. అయితే బాహుబలి సిరీస్ తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు అంచనాలని అందుకోలేకపోయాయి. ఇక ఆదిపురుష్ కూడా ఎవరేజ్ టాక్ నే సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సలార్ చిత్రం మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.


Click it and Unblock the Notifications











