Salaar: ప్రభాస్ తో విక్రమ్ లాంటి ట్విస్ట్.. KGF డైరెక్టర్ షాకింగ్ ప్లాన్?
రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి సినిమాలలో ఎక్కువగా అంచనాలను క్రియేట్ చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఊహించిన విధంగా ఉంటుంది అని మరొక అగ్ర హీరో కూడా ప్రత్యేక పాత్రల్లో వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విక్రమ్ సినిమా తరహా లోనే ట్విస్ట్ ఉంటుంది అని కూడా చెబుతున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆశలన్నీ సలార్ పైనే..
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సరైన విజయాన్ని అందుకోలేదు. ఆ సినిమా తర్వాత ఎంతో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమా మరింత తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఎలాగైనా తదుపరి సినిమాతో ప్రభాస్ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఈ తరుణంలో ప్రభాస్ అభిమానులు ఆశలన్నీ కూడా ఎక్కువగా సలార్ సినిమా పైనే ఉన్నాయి.

ముందే ఆదిపురుష్ ఉన్నప్పటికీ..
అయితే సలార్ సినిమా కంటే ముందే ఆదిపురుష్ సినిమా రాబోతోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా పూర్తిగా రామాయణం కథ ఆధారంగా తెరపైకి రానుంది. ఇక ఆ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కాకపోతే మాస్ యాక్షన్ సన్నివేశాలను కోరుకునే ప్రేక్షకులు మాత్రం సలార్ పైన ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు.

పెరుగుతున్న అంచనాలు
కేజీఎఫ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా యాక్షన్ సన్నివేశాలు తగిన మోతాదులో ఉంటాయి అని అంతేకాకుండా ప్రభాస్ మేనరిజం కూడా అద్భుతంగా ఉంటుంది అని అంచనాలు పెంచేసుకుంటున్నారు. అయితే దర్శకుడు కూడా ఇదివరకే అభిమానులు అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Recommended Video


సలార్ సినిమాలో
ఇక లేటెస్ట్ గా సినిమాకు సంబంధించిన మరొక టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని దర్శకుడు మాత్రం సినిమా చివరలో ఒక ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా ఇటీవల వచ్చిన విక్రమ్ తరహా రేంజ్ లోనే ఉంటుందట. విక్రమ్ సినిమాలో సూర్య ఎలాగైతే ప్రత్యేక పాత్రలో వచ్చాడో అదే తరహాలో సలార్ సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ హీరోను ప్రత్యేక పాత్రలో ప్రజెంట్ చేయబోతున్నారట.

మరో పవర్ఫుల్ రోల్?
సలార్ సినిమాను రెండు భాగాలుగా తెరపైకి తీసుకురావాలని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే సినిమా చివరలో 10 నిమిషాలు ఒక క్యారెక్టర్ లో యష్ కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ వార్త కన్నడలో వైరల్ అవుతోంది. అతని పాత్ర ఊహించని విదంగా ఉంటుందట. ఆ క్యారెక్టర్ నుంచి సెకండ్ పార్ట్ కొనసాగుతుందని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక సినిమాకు సంబంధించిన విడుదల తేదిపై త్వరలోనే ఒక అప్డేట్ రానున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











