పవన్ రిజెక్టు చేసినా...సల్మాన్ ఓకే చేసాడట?

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్' చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ‘గబ్బర్ సింగ్' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఇద్దరి అభిరుచులు ఓకేలా ఉంటాయని అనుకుంటారు అంతా. అయితే అన్ని విషయాల్లోనూ ఇలా జరుగదని తేలింది.
తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘కత్తి' చిత్రం అక్కడ భారీ విజయం సాధించి 100 కోట్లు వసూలు చేయడంతో తెలుగులో పవన్ కళ్యాణ్‍తో చేయడానికి ప్లాన్ చేసారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ సినిమా చూసి చేయడం ఇష్టం లేదని చెప్పాసాడు. దీంతో తెలుగులో తమిళ సినిమానే అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ఠాగూర్ మధు సొంతం చేసుకున్నారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కత్తి చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేస్తున్నారని, సల్మాన్ కూడా చేయడానికి సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కత్తి' సినిమా విషయానికి వస్తే ఇది సెజ్, రైతులకు మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన సినిమా. రైతులు తమ భూములను ఎలా కోల్పోతున్నారు. ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యవసాయానికి నీరు ఎంత అవసరం. అటువంటి నీటివనరుని ఆక్రమించి బీరు ఫ్యాక్టరీ కట్టాలనుకునే ఓ మల్టీనేషనల్ కంపెనీని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు. రైతులతో ప్రజల్లో ఎలాంటి చైతన్యాన్ని తీసుకువచ్చాడనేదే ప్రధానాంశంగా సినిమా సాగుతుంది.


Click it and Unblock the Notifications











