Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
సల్మాన్ కన్ను పడింది...నిర్మాత హ్యాపీ
హైదరాబాద్ : దక్షిణాది భాషల్లో ఏదన్నా ఓ చిత్రం హిట్టైతే దాన్ని కొని రీమేక్ చేసేదాకా సల్మాన్ ఖాన్ మనస్సు ఆగదు. అందుకే ఆయన ఎప్పటికప్పుడు సౌత్ లోని పెద్ద హీరోల చిత్రాలను ఓ కంటితో కనిపెడుతూంటారు. ఇక్కడ ట్రైలర్స్ ,ఫస్ట్ లుక్ అవీ చూసుకుని నిర్మాత ద్వారా స్టోరీ లైన్ తెలుసుకుంటారు. ఒక్కోసారి ఎంతోకొంత అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంటారు. రిలిజయ్యాక పూర్తి పేమెంట్ చేసి ఎగ్రిమెంట్ చేసుకుంటూంటారు. తాజాగా అలాంటి స్ట్రాటజినే సూర్య చిత్రం 'అంజాన్' (సికిందర్) కు కూడా అవలంభిస్తున్నట్లు సమాచారం.
సూర్య,సమంత ల మాస్ ఎంటర్టైనర్ రేపు(ఆగస్టు 15)న విడుదల అవుతోంది. దాంతో సల్మాన్ ఎందుకైనా మంచిదని కర్ఛిప్ వేసాడట. నిర్మాత నుంచి స్టోరీ లైన్ తెలుసుకుని తను రీమేక్ రైట్స్ తీసుకుంటానని చెప్పాడట. దాంతో నిర్మాత కూడా రిలీజ్ కు ముందే బాలీవుడ్ నుంచి రీమేక్ రైట్స్ కు ఆఫర్ రావటంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కూ మంచి బిజనెస్ చేసింది.
సూర్య ఇందులో కృష్ణ, రాజుభాయ్ అని రెండు పాత్రలు చేశారు. ముంబై నేపథ్యంలో కథ జరుగుతుంది. సంతోష్‌శివన్ కెమెరా పనితనం, యువన్ సంగీతం హైలైట్ అవుతాయి. సమంత, విద్యుత్ జమ్వాల్, బ్రహ్మానందంగారు ఇలా మంచి టీమ్ కుదిరింది. సినిమాలో ప్రతి 15-20 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది.
సూర్య మాట్లాడుతూ ''లింగుస్వామితో మా తమ్ముడు కార్తి 'ఆవారా' చేశాడు. ఈ డైరక్టర్‌తో షూటింగ్ చేస్తే మంచి ట్రిప్‌కి వెళ్లొచ్చిన ఫీలింగ్ ఉంటుందని చెప్పాడు. నాక్కూడా అచ్చం అలాగే అనిపించింది. మామూలుగా హీరోల దర్శకులు, నిర్మాతల దర్శకులు ఉంటారు. కానీ, లింగుస్వామి ఆడియన్స్ డైరక్టర్. తన మెమరీ పవర్ అమేజింగ్. ప్రతి సినిమాలోనూ, ప్రతి సన్నివేశంలోనూ ఏదో మేజి క్ చేస్తాడు. రెగ్యులర్ సినిమాను కూడా ఆయన చెప్పే స్టైల్, చూపించే విధానం కొత్తగా ఉంటుంది. అసలు ఎవరూ ఊహించని ఆ ట్విస్ట్‌లు విని నేను బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా విడుదలయ్యాక లగడపాటి శ్రీధర్ ద మోస్ట్ హ్యాపీయస్ట్ ప్రొడ్యూసర్‌గా ఉంటారు'' అని అన్నారు.
విద్యుత్ జమ్వాల్, మనోజ్‌బాజ్‌పాయ్, వివేక్, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.