ఇంకో తెలుగు సినిమాపై సల్మాన్ ఖాన్ కన్ను

By Srikanya

హైదరాబాద్ : సౌత్ రీమేక్ లో తన కెరీర్ ని మరింత పటిష్టం చేసుకుని హిట్ల బాటలో దూసుకువెళ్తున్న హీరో సల్మాన్ ఖాన్. ఆయన సౌత్ లో ఏ సినిమాలు రెడీ అవుతున్నాయి...ఏవి రిలీజ్ అవుతున్నాయి...వాటి భాక్సాఫీస్ పరస్దితి ఏంటనేది ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ...నచ్చితే కొనుక్కుని రీమేక్ చేస్తున్నారు. ఆ మధ్యన రవితేజ ...కిక్ చిత్రం రీమేక్ చేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు కిక్ 2 పై దృష్టి పడిందని సమాచారం. రీసెంట్ గా ఈ చిత్రం నిర్మాతతో మాట్లాడి స్టోరీ లైన్ తెలుసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం రీమేక్ విషయమై నిర్ణయం తీసుకుంటాడని చెప్పుకుంటున్నారు.

https://www.facebook.com/TeluguFilmibeat

రవితేజ హీరోగా రూపొందిన కిక్ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా కిక్-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలిసింది.

Salman inquires about Raviteja’s movie

చిత్ర కథలో భాగంగా రవితేజ యాభై ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నాడని చిత్ర వర్గాల సమాచారం. ఇటీవలే ఈ పాత్ర కోసం రవితేజకు దర్శకుడు సురేందర్‌రెడ్డి మేకప్ టెస్ట్ చేయించినట్లు చిత్ర వర్గాల సమాచారం. కిక్ సీక్వెల్ కావటంతో బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు.

రవితేజ, సురేందర్‌రెడ్డి అందించిన వినోదం 'కిక్‌'. బాలీవుడ్‌లోనూ విజయఢంకా మోగించిన చిత్రమిది. ఇప్పుడు అంతకు మించిన కిక్‌ ఇవ్వడానికి రవితేజ సిద్ధమయ్యారు. 'కిక్‌2' పట్టాలెక్కబోతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తోంద్ి.

'రేసుగుర్రం' తరవాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఎన్టీఆర్‌ఆర్ట్స్‌ పతాకంపై హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ''కిక్‌'కి మించిన వినోదం ఇందులో ఉంటుంది. రవితేజ పాత్ర శైలి, నటన మరోసారి ప్రేక్షకులకు కావల్సినంత కిక్‌ ఇస్తాయి. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస

‘బలుపు'తో కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ సాధించి జోరుమీదున్న రవితేజ, 2014లో ‘పవర్‌'తో ఆ జోరును కొనసాగించాడు. స్ర్కిప్ట్‌ రైటర్‌ బాబీ (కె.ఎస్‌. రవీంద్ర) దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రంలో ఏసీపీ బలదేవ్‌ సహాయ్‌గా, తిరుపతిగా రవితేజ తనదైన శైలి నటనతో అలరించి, మరోసారి ‘మాస్‌ మహారాజా' అనే గుర్తింపుకు న్యాయం చేశాడు. నిర్మాతకూ, బయ్యర్లకూ లాభాల పంట పండించాడు. ప్రస్తుతం ఆయన ‘కిక్‌ 2', ‘బెంగాల్‌ టైగర్‌' సినిమాలు చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X