twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ ఓపెనింగ్సే టార్గెట్... ‘సాహో’లో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్?

    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఫిల్మ్ 'సాహో'. ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా సెలక్ట్ చేయడంతో పాటు జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, ఎవలీన్ శర్మ లాంటి హిందీ స్టార్లను ముఖ్య పాత్రలకు ఎంపిక చేశారు.

    వీరితో పాటు మరో సర్‌ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేయించేందు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ మేరకు సల్లూ భాయ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

    టీ సిరీస్ సంస్థ మంతనాలు

    టీ సిరీస్ సంస్థ మంతనాలు

    ‘సాహో' చిత్రాన్ని హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్న ‘టీ సిరీస్' సంస్థ సల్మాన్ ఖాన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోందట. అయితే సల్మాన్ ఖాన్ ఒప్పుకుంటారా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం సల్లూ భాయ్ తన లేటెస్ట్ మూవీ, ఈద్ సందర్భంగా రిలీజ్ కాబోతున్న ‘భారత్' చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు.

    సల్మాన్ ఖాన్ ఒప్పుకుంటే బాక్సాఫీస్ సునామీ

    సల్మాన్ ఖాన్ ఒప్పుకుంటే బాక్సాఫీస్ సునామీ

    బాలీవుడ్ బాక్సాఫీసును తన స్టార్ ఇమేజ్‌తో ప్రభావితం చేయగల సల్మాన్ ఖాన్ ఉంటే ‘సాహో' చిత్రానికి మరింత ప్లస్ అవుతుంది. సల్లూ భాయ్... ‘బాహుబలి' స్టార్ కలిస్తే సినిమాపై అంచనాలు మరింత పెరిగి ఓపెనింగ్స్ టాప్ లేచిపోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అందుకే ‘సాహో'లో అతడిని గెస్ట్ రోల్ కోసం ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

    ఇంత భారీ బడ్జెట్ రికవరీ కావాలంటే..

    ఇంత భారీ బడ్జెట్ రికవరీ కావాలంటే..

    ‘సాహో' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌ తెరకెక్కిస్తోంది. బడ్జెట్లో ఎక్కువ శాతం(రూ. 90 కోట్లు) యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఖర్చు చేశారు. అబుదాబిలో 60 రోజుల పాటు చిత్రీకరించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలెట్ కాబోతోంది. ఇంత భారీ బడ్జెట్ రికవరీ కావాలంటే బిజినెస్ భారీగా జరుగాలి. అందుకే నిర్మాతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్‌తో గెస్ట్ రోల్ ప్లాన్ చేస్తున్నారట.

    ‘సాహో' టార్గెట్ ఎంత?

    ‘సాహో' టార్గెట్ ఎంత?

    ప్రభాస్ గత చిత్రం ‘బాహుబలి 2' ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్లు వసూలు చేసింది. ‘సాహో' రూ. 600 కోట్ల నుంచి రూ. 800 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలతో విడుదల చేస్తున్నారట. ఇక ఈమూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 400 కోట్ల వరకు జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

    English summary
    Bollywood Superstar Salman Khan has been approached for a cameo Prabhas’ next Film Saaho. The top actor is yet to give his nod and the makers are eagerly waiting to complete the part.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X