»   » సల్మాన్ ఖాన్ ఎంగేజ్మెంట్, గర్ల్ ఫ్రెండును పెళ్లాడబోతున్నాడా?

సల్మాన్ ఖాన్ ఎంగేజ్మెంట్, గర్ల్ ఫ్రెండును పెళ్లాడబోతున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ రహస్యంగా తన ప్రియురాలు, రొమేనియన్ టీవీ యాంకర్ లులియా వేంటర్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్నపట్లు వార్తలు గుప్పుమన్నాయి. లులియాతో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేస్తున్నట్లు చాలా ఏళ్ల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ వచ్చే ఏడాది లులియాను పెళ్లాడబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో తాజాగా మరోసారి వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఆ మధ్య జరిగిన సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ వివాహం సందర్భంగా....లులియా వేంటర్ కూడా హాజరైంది. సల్మాన్, లులియా డేటింగ్ చేస్తున్నట్లు అప్పుడే అందరికీ అర్థమైంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ ఆమెను పెళ్లాడేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఓ వైపు ‘బిగ్ బాస్' రియాల్టీ షో షూటింగ్, మరో వైపు తన తాజా సినిమా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రానికి సూరజ్ బర్‌జత్యా దర్శకత్వం వహిస్తున్నాడు. సోనమ్ కపూర్స ల్మాన్ కు జోడీగా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దివాళి సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

లులియా- సల్మాన్

లులియా- సల్మాన్

సల్మాన్ ఖాన్, లులియా ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

లులియా వేంటర్

లులియా వేంటర్

వచ్చే ఏడాది సల్మాన్ ఖాన్, లులియా వేంటర్ పెళ్లి జరుగుతున్నట్లు సమాచారం.

గర్ల్ ఫ్రెండుతో కలిసి

గర్ల్ ఫ్రెండుతో కలిసి

తన గర్ల్ ఫ్రెండుతో కలిసి సల్మాన్ ఖాన్ ఇలా...

సల్మాన్ ఫ్యామిలీ

సల్మాన్ ఫ్యామిలీ

సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఫోటోలో లులియా వేంటర్

ఫ్యామిలీ డిన్నర్

ఫ్యామిలీ డిన్నర్

సల్మాన్ ఖాన్ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తున్న లులియా.

సల్మాన్ గర్ల్ ఫ్రెండ్

సల్మాన్ గర్ల్ ఫ్రెండ్

లులియా వేంటర్ రొమేనియా టీవీ ప్రజెంటర్, నటి.

ఓ తేరి

ఓ తేరి

ఓ తేరి చిత్రంలో లులియా వేంటర్ ఐటం సాంగ్.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

మరి ఈ వార్తలను సల్మాన్ ఖాన్ ఖరారు చేస్తాడా? లేదా ఖండిస్తాడా? అనే దాని కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

English summary
Yes you read it right! Rumour has it that Salman Khan is secretly engaged to Romanian TV personality Iulia Vantur. Salman is dating Iulia for a long time now and is very serious for her. The actor might marry Iulia next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu