సల్మాన్ ఖాన్ కోసం ఆ ఇద్దరూ ఒక్కటయ్యారుగా.. దిల్ రాజు ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..

ఇండస్ట్రీలో ట్రెండ్ రోజురోజుకీ మారిపోతుంది. బడా హీరోల సినిమాలన్ని పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. అలా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన బ్యానర్‌లో సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అయితే.. తాజా భారీ ప్రాజెక్ట్‌పై ఒక క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటీ?

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబోలో ఓ భారీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం మరో హైలైట్. ఈ కాంబినేషన్ కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచుతోంది. అదేవిధంగా సినిమాలో అనిల్ కపూర్, అరవింద్ స్వామి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా 'ది మెసెంజర్' అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే టైటిల్ పై కూడా ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు.

Salman Khan Film Gets Massive Boost Thaman Anirudh Join for Musical Power Combo

ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్ కు మరింత బూస్ట్ ఇచ్చేలా ఓ న్యూస్ వైరలవుతోంది. సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన థమన్, అనిరుధ్ రవిచందర్ లు ఈ సినిమాలో కలిసి పనిచేయబోతున్నారట. సాధారణంగా ఒక సినిమాకు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. కానీ ఇటీవలి కాలంలో పెద్ద సినిమాలకు ఇద్దరు కంపోజర్‌లను తీసుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. అదే స్ట్రాటజీని సల్మాన్ ఖాన్ మూవీకి కూడా వాడుతుబోతున్నారట.

బాలీవుడ్ టాక్ ప్రకారం.. ఈ సినిమాలో పాటల బాధ్యతలను థమన్ తీసుకోగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అనిరుధ్ కంపోజ్ చేయనున్నాడట. ఈ కాంబినేషన్ నిజమైతే.. ఈ సినిమాకి మ్యూజికల్‌గా భారీ బూస్ట్ దొరికినట్టే. ఎందుకంటే థమన్ కమర్షియల్ సాంగ్స్‌లో తనదైన స్టైల్‌తో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడు. మరోవైపు అనిరుధ్ తన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సీన్స్‌కు ప్రాణం పోస్తాడు. ఈ ఇద్దరి స్ట్రెంగ్త్‌లు కలిస్తే సినిమా అవుట్‌పుట్ నెక్స్ట్ లెవెల్‌ అనే చెప్పాలి.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కాంబినేషన్‌ను సెట్ చేయడానికి నిర్మాత దిల్ రాజు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా మ్యూజిక్ కూడా అదే స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది రంజాన్ కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ టార్గెట్ పెట్టారు. మొత్తానికి సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు థమన్-అనిరుధ్ మ్యూజికల్ కాంబో వార్తలు కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇది ఇండియన్ సినిమా మ్యూజిక్‌లో ఒక కొత్త ట్రెండ్‌కు నాంది పలికినట్టే. మ్యూజిక్ లవర్స్‌తో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఉన్నారు.

Read more about: dil raju salman khan thaman
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X