Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు! సల్మాన్ ఖాన్ పెళ్లి భాజా?
వయసు యాభై ఏళ్లకు చేరువవుతున్నా బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉన్న సంగతి తెలిసిందే. తను ఎంతగానో ప్రేమించిన ఐశ్వర్యరాయ్ తనను కాదనడమే కాకుండా, పిచ్చోడిగా ముద్ర వేసిందనే బాధతో సల్లూ భాయ్ చాలా కాలం స్ట్రగుల్ అయ్యాడు. ఆ తర్వాత కత్రినా కైఫ్, మరికొందరు అందగత్తెలతో సల్లూ భాయ్ ఎఫైర్లు నడిపినట్లు వార్తలు వినిపించాయి. సల్మాన్ దుసురు స్వభావం వలనే అన్ని బెడిసి కొట్టాయనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఎఫైర్లకు దూరంగా ఉంటున్న సల్మాన్ మెల్లిమెల్లిగా వరుస హిట్లతో టాప్ హీరో పొజిషన్‌కి వెళ్లాడు. ఇప్పటి వరకు పెళ్లి జోలికి పోని ఈ హీరో....త్వరలో ఓ ఇంటి వాడవుతున్నట్లు బాలీవుడ్ టాక్. ప్రస్తుతం సల్లూభాయ్‌కి ఇంట్లో వాళ్లు సంబంధాలు చూసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా వాళ్లను కాకుండా మంచి కుటుంబం నుంచి సల్మాన్‌కి పిల్లను వెతికే ప్రయత్నంలో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు..
జెనీలియా, రితేష్ సంగీత్ కార్యక్రమానికి వచ్చిన అర్షాద్ వర్సి సల్మాన్ పెళ్లి గురించి వ్యాఖ్యానించాడని, సల్లూకి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టే అక్కడ అతని పెళ్లి ప్రస్తావన వచ్చిందని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. బాలీవుడ్ సెలబ్రిటీలు, ఆయన సన్నిహితులతో పాటు అభిమానులు కూడా సల్మాన్ పెళ్లి కావాలని కోరుకుంటున్నారు.
ఈ సంవత్సరం జెనీలియా-రితేష్ పెళ్లితో పాటు, కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ పెళ్లి కూడా జరుగబోతోంది. ఇదే ఏడాది సల్మాన్ పెళ్లి కూడా జరిగితే ఎక్కువ మంది బాలీవుడ్ స్టార్స్ పెళ్లి చేసుకున్న సంవత్సరంగా 2012 చరిత్రలో నిలిచి పోతుంది.