హీరోయిన్‌కు కారు ఎరగా వేస్తున్న టాప్ హీరో?
'దబాంగ్' చిత్రం భారీ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో దానికి సీక్వెల్‌గా దబాంగ్ 2 చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ కరీనా కపూర్‌తో ఐటం సాంగు చేయించాలని భావించాడు సల్మాన్. ఈ మేరకు ఈ చిత్ర నిర్మాత, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఆమెను సంప్రదించాడు. అయితే ఐటం సాంగు చేయడానికి కరీనా తొలుత నిరాకరించినా...తన సాంగుకు సినిమాలో అధిక ప్రాధాన్యత ఉండాలని, తాను ఓ ఐటం గర్ల్‌గా కాకుండా సినిమాలో పాత్ర ధారిగా ఉండాలని కండీషన్ పెట్టింది.
అయితే కరీనా ఒప్పుకోవడానికి ఇంకో కారణం కూడా ఉందట. ఆమెకు నచ్చిన విధంగా ఐటం సాంగు డిజైన్ చేయడంతో పాటు ఖరీదైన బిఎండబ్ల్యు7 సిరీస్ కారు బహుమతిగా ఇస్తానని చెప్పడమే అందుకు కారణం అంటున్నారు. ఏదిఏమైతేనేం....కరీనా ఒప్పుకోవడంతో సల్మాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు కారు కొని పెట్టేందుకు కారు డీలర్లతో సంప్రదింపులు జరుపుతున్నాడట.
ఆ సంగతి పక్కన పెడితే....ప్రకాష్ రాజ్ కూడా దబాంగ్ 2 లో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్, సోనక్షి సిన్హా తమ పాత్రలను తిరిగి ఈ సినిమాలోనూ పోషించబోతున్నారు. ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. సల్మాన్ - ప్రకాష్ రాజ్ గతంలో 'వాంటెడ్' సినిమాలో నటించారు. ఈ మూవీ సల్మాన్ ఖాన్ నట జీవితానికి పునః రుత్తేజాన్ని ఇచ్చింది. ఆసక్తికర మైన విషయం ఏమంటే, 'దబాంగ్' సినిమాలో విలన్ పాత్రను పోషించిన సోనూ సూద్ కూడా ఈ సీక్వెల్ లో నటించడం.
హిందీ లో 'సింఘం' సినిమా సూపర్ హిట్ కావటంతో బాలీవుడ్ లోనూ ప్రకాష్ రాజ్ తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. తెలుగు, తమిళ చిత్రాలతో ఎప్పుడూ అత్యంత బిజీగా వుండే ఈ జాతీయ ఉత్తమ నటుడు తన సమయాన్ని చాకచక్యంగా వినియోగించుకుంటున్నాడు. ఓ ప్రక్క నటన, మరోప్రక్క దర్శకత్వం, ఇంకోప్రక్క సినీ నిర్మాణం ఇత్యాది పనులన్నీ చురుగ్గా నిర్వర్తిస్తున్నారు.


Click it and Unblock the Notifications











